Romance : శృంగారం తర్వాత ఈ టిప్స్ ఫాలో అయితే ఇనెఫెక్షన్స్ మీ దరిచేరవు..

శృంగారం తర్వాత మనం పరిశుభ్రత పాటించడం ఎంతో అవసరం. ఇది అనేక వ్యాధుల నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. అందుకే నిపుణులు చెప్పే ఈ చిట్కాలను పాటిద్దాం....

Romance : శృంగారం తర్వాత ఈ టిప్స్ ఫాలో అయితే ఇనెఫెక్షన్స్ మీ దరిచేరవు..
Peeing After Romance
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 16, 2024 | 3:36 PM

ఢిల్లీకి చెందిన 30 ఏళ్ల రచయిత తాన్య వివాహం చేసుకున్నప్పుడు, ఆమె తల్లి ఒక ముఖ్యమైన లైంగిక సంరక్షణ చిట్కాను పంచుకుంది. శృంగారం తర్వాత మూత్ర విసర్జన చేయడం మర్చిపోవద్దని.. ఇది చాలా ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుందని..  ఆమె చిట్కా సారాశం. ఇది జనాల్లో విసృతంగా అవగాహన ఉన్న అంశమే. ఇలా చేయడం ద్వారా.. మహిళలు..  మూత్ర నాళాల ఇన్ఫెక్షన్(UTI), ఇతర ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలను దూరంగా ఉండవచ్చని నమ్ముతారు. పురుషుల కంటే ఎక్కువగా మహిళలకు UTI సోకే ప్రమాదం ఎక్కువ ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మొదటి సంభోగం తర్వాత, కొంతమంది స్త్రీలు UTI బారిన పడవచ్చు. ఇది అసాధారణం కాదు అని..శృంగార సమయంలో మూత్ర నాళంలోకి బ్యాక్టీరియా ప్రవేశించడం వల్ల సంభవించవచ్చని అంటున్నారు.  మూత్రవిసర్జన సమయంలో మంట, తరచుగా మూత్రవిసర్జన లేదా పొత్తికడుపులో నొప్పి వంటివి UTI సాధారణ లక్షణాలు అని చెబుతున్నారు. అయితే సంభోగం తర్వాత మూత్ర విసర్జన చేయడం నిజంగా అవసరమా అని..మేము నిపుణులను అడిగాము.

నుబెల్లా సెంటర్ ఫర్ ఉమెన్స్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గీతా ష్రాఫ్, సంభోగం తర్వాత మూత్ర విసర్జన చేయడం చాలా అవసరమని నొక్కి చెప్పారు. “శంగారం తర్వాత మూత్ర విసర్జన చేయడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లేదా ఇతర ఇన్‌ఫెక్షన్లను కూడా నివారించవచ్చు. లైంగిక సంపర్కం సమయంలో, జననేంద్రియాల నుంచి బ్యాక్టీరియా మూత్రనాళంలోకి ప్రవేశించవచ్చు. లైంగిక సంపర్కం తర్వాత మూత్రవిసర్జన చేయడం వల్ల ఈ బ్యాక్టీరియా బయటకు వచ్చేస్తుందని, ”అని డాక్టర్ ష్రాఫ్ తెలిపారు

న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ ప్రొఫెసర్ డాక్టర్ కనికా జైన్ మాట్లాడుతూ… “లైంగిక చర్యలు… ఎస్చెరిచియా కోలి (E. కోలి) వంటి బ్యాక్టీరియాను డెవలప్ చేస్తాయి. శృంగారం అనతరం మూత్ర  విసర్జన చేయడం వలన బ్యాక్టీరియా మూత్రాశయంలోకి వెళ్లే ప్రమాదాన్ని తగ్గిస్తాయి” అని చెప్పారు. సంభోగం తర్వాత 15-30 నిమిషాలలోపు మూత్ర విసర్జన చేయడం మంచిదని చెబుతున్నారు.  మొదటి దశ ఇన్ఫెక్షన్ నుండి బయటపడటానికి పుష్కలంగా నీరు తాగడం ముఖ్యం. లక్షణాలు కొనసాగితే, దానిని క్లియర్ చేయడానికి యాంటీబయాటిక్స్ అవసరం కావచ్చు. చికిత్స చేయకపోతే UTI మరింత తీవ్రం అవుతుంది.  శృంగారం తర్వాత మూత్ర విసర్జన చేయడం 100 శాతం రక్షణను అందించదని, అయితే ఖచ్చితంగా UTI వ్యాప్తి చెందే అవకాశాలను తగ్గిస్తుందన్నది నిపుణులు వెర్షన్.

సంభోగం తర్వాత అనుసరించాల్సిన మంచి పరిశుభ్రత చిట్కాలు

శృంగారం తర్వాత కొన్ని టిప్స్ పాటిస్తే ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తిని నివారించవచ్చు.

  • శుభ్రత ముఖ్యం : సంభోగం తర్వాత జననేంద్రియ ప్రాంతాన్ని గోరువెచ్చని నీటితో కడగమని సలహా ఇస్తున్నారు నిపుణులు. సహజమైన pH బ్యాలెన్స్‌కు అంతరాయం కలిగించే సువాసనగల సబ్బులను వాడొద్దంటున్నారు .
  • బట్టలు మార్చుకోండి : సెక్స్ తర్వాత బిగుతుగా ఉన్న బట్టలు లేదా గాలి ఆడని దుస్తులు ధరించడం మానుకోండి. బిగుతుగా లేదా తడిగా ఉన్న దుస్తులు బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఆ ప్రాంతాన్ని పొడిగా, తాజాగా ఉంచడానికి వదులుగా ఉండే, ఊపిరి పీల్చుకునే కాటన్ లోదుస్తులను ఎంచుకోండి.
  • చేతులు కడుక్కోవాలి : సంభోగానికి ముందు, తర్వాత క్రిములు వ్యాప్తి కాకుండా ఉండటానికి చేతులు శుభ్రపరచడం తప్పనిసరి అంటున్నారు.
  • హైడ్రేటెడ్‌గా ఉండండి : పుష్కలంగా నీరు త్రాగడం వల్ల మూత్రవిసర్జన క్రమం తప్పకుండా జరుగుతుంది. అలా అయితే సహజంగా మూత్ర నాళం నుండి బ్యాక్టీరియాను ఫ్లష్ చేస్తుంది.
  • సురక్షితమైన సెక్స్‌ను ప్రాక్టీస్ చేయండి : కండోమ్‌లను ఉపయోగించడం లైంగికంగా సంక్రమించే ఇన్‌ఫెక్షన్‌లను (STIs) నిరోధించడంలో సహాయపడుతుంది.
  • లక్షణాలను పర్యవేక్షించండి : మీరు చికాకు, నొప్పి లేదా ఏదైనా ద్రవం కారడం వంటివి గమనించినట్లయితే, వైద్యుడిని సంప్రదించండి. లక్షణాలను విస్మరించడం వలన అంటువ్యాధులు మరింత తీవ్రమవుతాయి, మరింత ఇంటెన్సివ్ చికిత్స అవసరమవుతుంది అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు
  • శృంగార టాయ్స్ క్లీన్ చేయండి : భారతదేశంలో శృంగారం టాయ్స్ వినియోగం పెరుగుతోంది, ఈ ఉత్పత్తులు కేవలం బ్లింక్‌ఇట్ దూరంలో ఉన్నాయి. బెడ్‌రూమ్‌లో అవి మీకు ఉత్సాహాన్ని కలిగించేలా చేస్తాయి,.అయితే ఇన్‌ఫెక్షన్‌లను దూరంగా ఉంచడానికి వాటిని సరిగ్గా శుభ్రం చేయడం చాలా అవసరం. బాక్టీరియా బదిలీని నివారించడానికి వైద్యులు బొమ్మలను గోరువెచ్చని నీటితో, తగిన క్లెన్సర్‌తో కడగాలని సూచిస్తున్నారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?