ఉదయం నిద్ర లేవగానే విపరీతమైన దాహంతోపాటు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? ఇక ఆలస్యం చేయకండి..

ప్రస్తుత కాలంలో అధిక సంఖ్యలో ప్రజలు అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. వృద్ధుల నుంచి యువకులు..పిల్లలు కూడా అధిక రక్తపోటు సమస్యలను ఎదుర్కొంటున్నారు. అతి చిన్న వయసులోనే హైబీపీ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. దీనికి ప్రధానకారణం ఆహారం, జీవనశైలి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఉదయం నిద్ర లేవగానే విపరీతమైన దాహంతోపాటు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? ఇక ఆలస్యం చేయకండి..
Health Tips
Follow us

|

Updated on: Jul 01, 2024 | 9:24 AM

ప్రస్తుత కాలంలో అధిక సంఖ్యలో ప్రజలు అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. వృద్ధుల నుంచి యువకులు..పిల్లలు కూడా అధిక రక్తపోటు సమస్యలను ఎదుర్కొంటున్నారు. అతి చిన్న వయసులోనే హైబీపీ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. దీనికి ప్రధానకారణం ఆహారం, జీవనశైలి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు జన్యుపరమైన కారణాలు, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల కూడా బీపీ (బ్లడ్ ప్రెజర్) కు దారితీస్తుంది..

రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు మీ శరీరంలో అనేక లక్షణాలు కనిపిస్తాయి.. చాలా సార్లు ఉదయం వేళ.. మనం నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు మన శరీరం అధిక రక్తపోటు సంకేతాలను ఇస్తుంది. మీరు దానిని విస్మరించకూడదు. అకస్మాత్తుగా మైకము, నీరసంగా అనిపించడం, చిరాకు.. ఆందోళనతోపాటు మీ దృష్టి మసకబారుతుంటే.. మీరు సమస్యలో ఉన్నారని అర్ధం చేసుకోవాలి.. ఇవి అధిక రక్తపోటు లక్షణాలు కావచ్చు. ఉదయం బీపీ పెరిగినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకోండి.

ఉదయం రక్తపోటు ఎక్కువగా పెరిగినప్పుడు శరీరంలో ఈలాంటి లక్షణాలు కనిపిస్తాయి..

మైకము: ఉదయం నిద్రలేచిన వెంటనే తల తిరగడం అనిపిస్తే అది అధిక రక్తపోటు లక్షణం కావచ్చు. కొన్నిసార్లు మీరు మంచం మీద నుండి లేచిన వెంటనే, మీ తల తిరుగుతుంది.. తరచూ మైకము వచ్చేలా అనిపిస్తుంది. ఇలా అనిపిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించి బీపీ చెక్ చేసుకోవాలి.

దాహంగా అనిపించడం: రాత్రిపూట నీళ్లు తాగకపోతే ఉదయం దాహం వేస్తుంది. ఇది సాధారణం.. అయితే ఉదయం నిద్ర లేవగానే చాలా దాహం వేసి నోరు ఎండిపోతే ఇవి హై బీపీ లక్షణాలు. శరీరంలో రక్తపోటు పెరిగినప్పుడు ఇలా జరుగుతుంది. ఇది సాధారణమైనదిగా కొట్టిపారేయకూడదు.

మసకబారిన దృష్టి: ఉదయం నిద్ర లేవగానే కొంత సేపటికి చూపు మందగించినట్లయితే.. వెంటనే బీపీని చెక్ చేసుకోవాలి. ఇది అధిక రక్తపోటు, లక్షణం కావచ్చు. బీపీ పెరిగినప్పుడు కళ్లపై ఒత్తిడి పడుతుంది. ఇది దృష్టిని తగ్గించి.. కళ్లను బలహీనపరుస్తుంది.

వాంతులు – వికారం: మీరు నిద్రలేచిన వెంటనే వాంతులు లేదా వికారం అధిక రక్తపోటు లక్షణాలు కావచ్చు. శరీరంలో రక్త ప్రసరణ పెరిగినప్పుడు, ఒక వ్యక్తి నీరసంగా మైకముతో ఉంటాడు.. ఇది వాంతి అనుభూతిని కలిగిస్తుంది.

బాగా అలిసిపోయి కనిపించడం: మీరు రాత్రి వేళ మంచిగా నిద్ర పోయిన తర్వాత ఉదయం అలసిపోయినట్లు, బలహీనంగా అనిపిస్తే, ఖచ్చితంగా మీ రక్తపోటును తనిఖీ చేసుకోవాలి.. కొన్నిసార్లు ఇది అధిక రక్తపోటుతో కూడా సంభవిస్తుంది. అలాంటి వ్యక్తులు ఉదయం చాలా తక్కువ శక్తిని అనుభవిస్తారు.

మీరు అలాంటి లక్షణాలను అనుభవిస్తే, వెంటనే మీ రక్తపోటును తనిఖీ చేసుకోవాలి.. కావున వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందండి..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..