Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nicker Nut-Ayurveda Tips: గచ్చకాయ చెట్టు ఔషధాల గని.. బట్టతలపై జుట్టునే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది..

Caesalpinia Bonduc: గచ్చకాయ ఇవి ఇప్పటి జనరేషన్ కు పెద్దగా తెలియక పోవచ్చు కానీ.. మన పెద్ద వాళ్లకు ఇవి సుపరిచితమే.. ఇవి భారత దేశంలోని ప్రతి చోటా దర్శనమిస్తాయి. ఎక్కువుగా అటవీ ప్రాంతాల్లో..

Nicker Nut-Ayurveda Tips: గచ్చకాయ చెట్టు ఔషధాల గని.. బట్టతలపై జుట్టునే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది..
Nicker Nuts
Follow us
Surya Kala

|

Updated on: Sep 27, 2021 | 9:07 AM

Nicker Nut-Ayurveda Tips: గచ్చకాయ ఇవి ఇప్పటి జనరేషన్ కు పెద్దగా తెలియక పోవచ్చు కానీ.. మన పెద్ద వాళ్లకు ఇవి సుపరిచితమే.. ఇవి భారత దేశంలోని ప్రతి చోటా దర్శనమిస్తాయి. ఎక్కువుగా అటవీ ప్రాంతాల్లో విస్తరించి ఉంటాయి. బంజరు భూములు, తీరప్రాంతాలు, ఆకులు రాలే చెట్లున్న అడవులలో చెట్లును పట్టుకుని తీగలా పైకి పాకుతుంది. గచ్చకాయ చెట్టుకు ముళ్ల కాయలు ఉంటాయి. వీటిల్లో లోపల ఉన్న చిన్న చిన్న గోళీల వంటి గింజలు ఉంటాయి. ఈ గింజలతో చిన్నతనంలో ఆడపిల్లలు గచ్చకాయ ఆటలు ఆడితే.. మగపిల్లలు గోళీల ఆటలు ఆడేవారు. ఈ గచ్చకాయను రాయి మీద శరీరం మీద పెట్టి చుర్రుమని మంటపెట్టించి నవ్వుకున్న బాల్యం మన పెద్దల సొంతం. ఇక  గచ్చకాయ గురించి ప్రత్యేకంగా ఒక పుస్తకమే రాయవచ్చు.  గచ్చకాయ గింజల్లో పసుపు పచ్చని చిక్కని ద్రవం ఉంటుంది. సిసాల్పిన్, అయోడిన్, సాపోవిన్, నాన్ గ్లూకోసైడల్ పదార్థాలు ఉంటాయి. వీటి గింజలు చేదుగా ఉంటాయి. గచ్చకాయ చెట్టు, బెరడు, ఆకులు, కాయలు మన ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు.. గచ్చకాయ చెట్టు మన ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలుసుకుందాం..

గచ్చకాయ గింజలు: 

గచ్చకాయ గింజలు కఫాన్ని, వాతాన్ని నివారిస్తాయి. పిత్తాన్ని పెంచుతుంది. రక్త దోషాలను, వాపులను తొలగిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. గింజలు ఉష్ణతత్వం కలవి. రక్త వృద్ధికి తోడ్పడతాయి. మెదడుకు, కళ్ళకు, చర్మకాంతికి గచ్చకాయ గింజలను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.  అంతేకాదు గచ్ఛ గింజలకు.. మూత్రసమస్యలను నయం చేసే శక్తి ఉంది. మైగ్రేన్, తలనొప్పి తగ్గడానికి ఉపయోగిస్తారు. మధుమేహం తగ్గడానికి, వాంతులు తగ్గడానికి, సిఫిలిస్, ఇతర సుఖవ్యాధులు తగ్గడానికి, కిడ్నీలలో రాళ్ళు తగ్గడానికి, రక్తం కారే పైల్స్ నివారణ కు,  చర్మ వ్యాధులు తగ్గడానికి, అల్సర్ల వల్ల వచ్చే వాపులు తగ్గటానికి, కీళ్ళనొప్పులు తగ్గడానికి వాడుతారు. గచ్చకాయ లోపల ఉన్న గింజలు రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో వేసి ఉదయం ఆ గింజలు తిని ఆ నీటిని తాగాలి. ఇలా 15 రోజులు చేస్తే షుగర్ వ్యాధి తగ్గుతుంది. ఈ చిట్కా ప్రయత్నించేటప్పుడు ప్రతి మూడు లేదా నాలుగు రోజులకు ఒకసారి టెస్ట్ చేయించుకుంటే ఫలితాలు మీరే గమనించవచ్చు. షుగర్ లెవెల్స్ అదుపులోకి వచ్చిన తరువాత ఈ నీటిని తాగడం మానేయాలి. గచ్చకాయ లోపల ఉన్న గింజలు జ్వరాన్ని తగ్గిస్తాయి.. గజ్జి కాయ లోపల ఉన్న గింజలను నీటితో కలిపి నూరి నీటిని పొట్టపై రాస్తే జ్వరం తగ్గుతుంది.

ఇక గచ్చకాయల నుంచి తీసే తైలం చర్మ వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.  అంతేకాదు బట్టతలపై జుట్టు రావడానికి గచ్చకాయ గింజలు తైలాన్నిఉపగిస్తారు.

గచ్చ ఆకులు:  దగ్గు, పైల్స్, వాతం, కడుపులో పురుగులు, వాపులు పోవడానికి గచ్చ ఆకులు ను ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఫైల్స్ తో ఇబ్బందిపడుతున్నవారు ఈ ఆకులను మెత్తగా నూరి.. పైల్స్ గడ్డలపై పూస్తారు. ఇక గచ్చకాయ లేత మొక్కల ఆకులు వరిబీజం తో ఇబ్బందిపడుతున్నవారికీ దివ్య ఔషధం. లేత ఆకులను ఆముదంలో వేయించి వృషణాలకు మూడు పూటలా కడితే.. వరిబీజం తగ్గుతుంది. గచ్చకాయ ఆకులను ఆముదం లో వేయించి కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి ఉన్నచోట వేసి కట్టుకడితే చాలు.. ఇలా చేస్తే కీళ్ళవాపు, జాయింట్ పెయిన్, మజిల్ పెయిన్ అన్నీ తగ్గుతాయి.   గచ్చ ఆకులను, వేప ఆకులను ముద్దగా నూరి గజ్జి తామర ఎర్ర దురద ఉన్నచోట రాస్తే అవి తగ్గుతాయి. దీన్ని అన్ని రకాల చర్మ సమస్యలకు ఉపయోగించవచ్చు.

గచ్చకాయ పూలు: 

గచ్చకాయ చెట్టు పూల రసం షుగర్ వ్యాధికి గ్రస్తులకు మంచి మెడిసిన్. ఈ పూల రసాన్ని ప్రతి రోజూ తీసుకుంటే షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉంటుంది. అంతే కాకుండా ఈ రసం తాగుతుంటే మూత్ర సంబంధిత సమస్యలు ఉంటే తగ్గుతాయి

గచ్చకాయ పుల్లలు: 

గచ్చకాయ చెట్టు పుల్లలను ముళ్ళు లేకుండా తీసుకుని ఆ పుల్లలతో పళ్ళు తోముకుంటే చిగుళ్ల నుంచి రక్తం కారటం, దంత సమస్యలను నివారిస్తుంది.

మహిళలకు 

రుతుక్రమం సరిగా రాని మహిళలు.. చిటికెడు గచ్చకాయల పొడిలో ఐదు మిరియాలు కలిపి తీసుకుంటే రెగ్యులర్ గా వస్తుంది. అంతేకాదు రుతుక్రమంలో వచ్చే అనేక నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

Also Read:

ఎంతో ఆరోగ్యకరమైన గుమ్మడి కాయ హల్వా.. ఇంట్లో చాలా ఈజీగా ఇలా తయారు చేసుకోండి..

నేడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. పైలట్ దశలో ఆరు కేంద్ర ప్రాంతాలు ఎంపిక