Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brain Tumor: మైగ్రేన్, బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చే తలనొప్పికి మధ్య చాలా తేడా ఉంది.. ఈ లక్షణాలతో వాటికి గుర్తించండి..!

Brain Tumor: ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం బ్రెయిన్ ట్యూమర్ కేసులు పెరుగుతున్నాయి. చాలా సందర్భాలలో ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది.

Brain Tumor: మైగ్రేన్, బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చే తలనొప్పికి మధ్య చాలా తేడా ఉంది.. ఈ లక్షణాలతో వాటికి గుర్తించండి..!
Brain Tumor
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 16, 2022 | 6:10 AM

Brain Tumor: ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం బ్రెయిన్ ట్యూమర్ కేసులు పెరుగుతున్నాయి. చాలా సందర్భాలలో ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలను సకాలంలో గుర్తించడం ద్వారా సులభంగా చికిత్స చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే, దీనిని గుర్తించడంలో ఆలస్యం చేయడం కారణంగానే ప్రాణాల మీదకు వస్తుందంటున్నారు. బ్రెయిన్ ట్యూమర్‌లో తలనొప్పి అనేది అత్యంత సాధారణ లక్షణం. అయితే, ఆ తలనొప్పి సాధారణ నొప్పా, మైగ్రేన్ నొప్పా, బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చే నొప్పా అని ప్రజలు గుర్తించలేకపోతున్నారు. బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చే తలనొప్పి లక్షణాలు ఏంటి? ఇతర తలనొప్పి లక్షణాలు ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి, డిప్రెషన్, జీవనశైలి, ఆందోళన కారణంగా తలనొప్పి సమస్య చాలా ఎక్కువైందని రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ న్యూరో అండ్ స్పైన్ సర్జరీ చీఫ్ డాక్టర్ ఈశ్వర్ చంద్ర ప్రేంసాగర్ అంటున్నారు. చాలా సార్లు మానసిక ఒత్తిడి వల్ల తలనొప్పి వచ్చినా, తలనొప్పి అలానే ఉండి ప్రతిరోజూ ఈ సమస్య వస్తుంటే అజాగ్రత్తగా ఉండకూడదని హెచ్చరిస్తున్నారు. ఈ రకమైన తలనొప్పి మెదడు కణితి వంటి తీవ్రమైన వ్యాధి లక్షణం కావచ్చు అని అలర్ట్ చేస్తున్నారు.

బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చే మైగ్రేన్‌కి, తలనొప్పికి చాలా తేడా ఉంటుందని డాక్టర్ ప్రేమ్ చెప్పారు. మైగ్రేన్‌లో తలకు ఒక భాగం వైపు మాత్రమే నొప్పి ఉంటుంది. అది ఎప్పుడైనా వస్తుంది. కానీ, ఎవరికైనా తెల్లవారుజామున విపరీతమైన తలనొప్పి ఉంటే, అది వాంతులతో కూడి ఉంటే మెదడు కణితి లక్షణం కావచ్చు అని చెబుతున్నారు. మాట్లాడేటప్పుడు లేదా నడిచేటప్పుడు చూపు మందగించడం, సమతుల్యత కోల్పోవడమే కూడా మెదడు కణితి లక్షణం అని డాక్టర్ చెబుతున్నారు. ఎవరికైనా ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

పిల్లలకు కూడా ఈ సమస్య రావచ్చు.. వైద్యుల సమాచారం ప్రకారం.. చిన్నపిల్లలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటారు. అయితే, పెద్దలతో పోలిస్తే వీరికి చికిత్స చాలా సులభం. ఇక్కడో మరో చిక్కు ఏంటంటే.. చిన్న పిల్లల్లో బ్రెయిన్ ట్యూమర్ అనేది వెంటనే గుర్తించలేని పరిస్థితి ఉంటుంది. కారణం.. పిల్లల్లో వచ్చే తలనొప్పిని సాధారణ తలనొప్పిగా పరిణగించడమే. అందుకే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండటం ముఖ్యం అని సూచిస్తున్నారు వైద్యులు. పిల్లలు నిరంతరం తలనొప్పితో బాధపడుతుంటే.. వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స అందించాలి. బ్లడ్ క్యాన్సర్ తర్వాత పిల్లల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్ అని వైద్యులు చెబుతున్నారు. తలనొప్పితో పాటు వాంతులు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, అలసటగా ఉండడం వంటివి బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు.