Health: తుప్పల్లో ఉంటుందని పిచ్చి తీగ అనుకునేరు.. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే
తిప్పతీగ.. పొలాల్లో చెట్లను అల్లుకుని పిచ్చిమొక్కలా కనిపించే తీగజాతి మొక్క విరివిగా లభించే తిప్పతీగలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. తిప్పతీగలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరరీంలోని కణాలు దెబ్బతినకుండా, వ్యాధుల బారినపడకుండా పనిచేస్తాయి. ఆయుర్వేదం ప్రకారం దీనిని అమృతంతో పోల్చి చెబుతారు.

తిప్ప తీగ.. పల్లెటూర్లలో ఎక్కడపడితే అక్కడ కనిపిస్తుంది. సిటీల్లో కూడా కూడా రోడ్ల పక్కన కొన్నిచోట్ల కనిపిస్తుంది. ఈ తీగ గొప్పతనం గురించి టౌన్ జనాలకు తెలియకపోవచ్చు. కానీ ఒక్కసారి మీ ఇంట్లో వయస్సు మీదపడిన పెద్దవారు ఉంటే కనుక్కోండి. దీని బెనిఫిట్స్ ఏంటో చెబుతారు. అమృత, గుడూచి పేర్లతో దీన్ని పిలుస్తారు. తిప్ప తీగ ఆకులు తమలపాకుల స్వరూపాన్ని పోలి ఉంటాయి. కానీ పరిమాణంలో వాటి కంటే చాలా చిన్నగా ఉంటాయి. ఆ తిప్పతీగ బెనిఫిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం…
- వివిధ జీవక్రియ రుగ్మతలకు చికిత్స చేయడంలో తిప్పతీగ ఉపయోగపడుతుంది
- తిప్పతీగ ఆకులను ఉండలు చేసి 10 రోజుల పాటు ఉదయం, సాయంత్రం తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది.
- తిప్ప ఆకుల రసం తాగితే జ్వరం కూడా తగ్గిపోతుంది
- కిడ్నీ సంబంధిత జబ్బులు, షుగర్.. అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు ఆయుర్వేదంలో తిప్ప తీగ ఆకులు, కాండాన్ని ఉపయోగిస్తారు.
- తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో ఫైట్ చేస్తాయి. అలాగే మీ బాడీలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తిప్పతీగ ఉపయోగపడుతుంది.
- మీరు ఎంగ్జైటీ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో ఇబ్బందిపడుతుంటే తిప్పతీగతో తయారు చేసిన మెడిసిన్ ఉపయోగించడం మంచిది. మీకు మంచి రిలీఫ్ దొరుకుతుంది.
- జలుబు, దగ్గు, టాన్సిల్స్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించగల గుణాలు తిప్పతీగలో ఉన్నాయి.
- వేడి పాలలో తిప్పతీగ పొడిని కలుపుకుని తాగితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ పెయిన్స్ నుంచి రిలీప్ ఉంటుంది.
- తిప్పతీగ వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయగలదని పలు సర్వేల్లో వెల్లడైంది
(ఈ సమాచారం ఆయుర్వేద నిపుణులు నుంచి సేకరించినది. ఇది అందరి శరీర తత్వాలకు సూట్ కాకపోవచ్చు. మీ వైద్యులను సంప్రదించకుండా అస్సలు ఫాలో అవ్వొద్దు)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




