AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి లివర్ వ్యాధుల ప్రమాదం.. అసలు విషయం తెలిస్తే షాకే..

కొత్త అధ్యయనం ప్రకారం..మన బ్లడ్ గ్రూప్ కాలేయ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. A బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి ఆటో ఇమ్యూన్ కాలేయ వ్యాధులైన ప్రైమరీ బిలియరీ కోలాంగైటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువ. B బ్లడ్ గ్రూప్ వారికి ఈ ప్రమాదం తక్కువ. సరైన జీవనశైలి మార్పులు, ముందస్తు నిర్ధారణ కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ లక్షణాలు ఉంటే వెంటనే అలర్ట్ అవ్వండి..

ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి లివర్ వ్యాధుల ప్రమాదం.. అసలు విషయం తెలిస్తే షాకే..
A Blood Group Linked To Liver Disease Risk
Krishna S
|

Updated on: Nov 28, 2025 | 1:57 PM

Share

సాధారణంగా మనం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మన బ్లడ్ గ్రూప్ ఏంటనేది తెలుసుకోవాలనుకుంటాం. కానీ ప్రముఖ జర్నల్ ఫ్రాంటియర్స్‌లో ప్రచురించిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. మన బ్లడ్ గ్రూప్ మన ఆరోగ్యం గురించి చాలా విషయాలను చెప్పగలదు. ముఖ్యంగా కొన్ని రక్త వర్గాలు ఉన్నవారికి ఆటో ఇమ్యూన్ కాలేయ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం వెల్లడించింది

A బ్లడ్ గ్రూప్‌కు ఎక్కువ ప్రమాదం

ఈ అధ్యయనం ప్రకారం..A బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి ఆటో ఇమ్యూన్ కాలేయ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆటో ఇమ్యూన్ వ్యాధులు వచ్చినప్పుడు, మన రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మన కాలేయంపై దాడి చేసి, దాన్ని దెబ్బతీస్తుంది. పరిశోధకులు సుమారు 1,200 మందిని పరీక్షించగా.. వీరిలో 114 మందికి ఆటో ఇమ్యూన్ కాలేయ వ్యాధి ఉంది. కాలేయ సమస్యలు ఉన్నవారిలో A రక్త వర్గం ఎక్కువగా ఉండగా ఆ తర్వాత O, B మరియు AB గ్రూపులు ఉన్నాయి.

B బ్లడ్ గ్రూప్‌కు తక్కువ రిస్క్

దీనికి విరుద్ధంగా B బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి కాలేయ వ్యాధుల ప్రమాదం చాలా తక్కువగా ఉంది. వారు ప్రైమరీ బిలియరీ కోలాంగైటిస్ అనే దీర్ఘకాలిక కాలేయ వ్యాధి బారిన పడే అవకాశం తక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు. ఈ వ్యాధిలో పిత్త వాహికలు దెబ్బతింటాయి. పిత్తం కాలేయంలో పేరుకుపోతుంది. ఇది చివరికి సిరోసిస్, కాలేయ వైఫల్యానికి దారితీయవచ్చు.

ఇవి కూడా చదవండి

ముందు జాగ్రత్తలు అవసరం

మీ బ్లడ్ గ్రూప్ A అయినంత మాత్రాన మీకు ఖచ్చితంగా కాలేయ వ్యాధి వస్తుందని కాదు. కానీ ఇది ప్రమాద కారకం కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా అలసట, కీళ్ల నొప్పులు వంటి చిన్న లక్షణాలు కనిపించినా తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం, వ్యాధులను ముందస్తుగా గుర్తించడం, చికిత్స పొందడం కాలేయానికి మంచిది.

కాలేయ ఆరోగ్యం కోసం పాటించాల్సిన నియమాలు

  • PBC వంటి దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు ఉన్నవారు పాటించాల్సిన జీవనశైలి మార్పులు ఇవి:
  • ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానుకోవాలి, ఇది కాలేయానికి మరింత హానికరం.
  • తక్కువ సోడియం ఉండే ఆహారం తీసుకోవడం వల్ల పొత్తికడుపులో నీరు నిలిచిపోవడం తగ్గుతుంది.
  • తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, గింజలు, చిక్కుళ్లు వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్ వంటి మంచి కొవ్వులు తీసుకోవడం, సంతృప్త కొవ్వులను తగ్గించడం మంచిది.
  • PBC ఉన్నవారికి ఎముకలు బలహీనపడే ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారం లేదా సప్లిమెంట్లను తీసుకోవాలి.
  • రోజూ వ్యాయామం చేయడం కాలేయ ఆరోగ్యానికి, ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..