Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Foods: రంగును చూసి కాదు..పోషకాలను చూసి బ్లాక్ ఫుడ్స్‌ని తినండి.. ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో..

Black Foods Health Benefits: మారుతున్న కాలంతో పాటు మనిషి జీవన విధానం, ఆహారపు అలవాట్లు ఇలా అన్నిటిలోను మార్పులు వచ్చాయి.  పూర్వం మన పెద్దవారు..

Black Foods: రంగును చూసి కాదు..పోషకాలను చూసి బ్లాక్ ఫుడ్స్‌ని తినండి.. ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో..
Black Food Health Benefits
Follow us
Surya Kala

|

Updated on: Nov 04, 2021 | 10:25 AM

Black Foods Health Benefits: మారుతున్న కాలంతో పాటు మనిషి జీవన విధానం, ఆహారపు అలవాట్లు ఇలా అన్నిటిలోను మార్పులు వచ్చాయి.  పూర్వం మన పెద్దవారు అన్ని రకాల ఆహారాలను ఇష్టంగా తినేవారు.. అందుకనే ఎంత వయసు వచ్చినా ఆరోగ్యంగా ఉండేవారు. అయితే ఇప్పటి జనరేషన్ ఏదైనా తినాలంటే.. ముందుగా కంటికి ఇంపుగా ఉండాలి. నోరికి రుచిగా లేకపోతె.. అసలు తినడం అన్నమాటనే మరచిపోతారు. అయితే మనం తినే ఆహారాన్ని కలర్ చూసి కాదు.. అవి ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు చూసి తినమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నలుపు రంగు ఆహార పదార్ధాల్లో ఆరోగ్యాన్ని ఇచ్చే పోషకాలు అధికమని అంటున్నారు.  బ్లాక్ కలర్ ఫుడ్స్ లో ఆంథోసైనిన్స్ ఉన్నాయి. నలుపు, నీలం మరియు ఊదారంగు సంపూర్ణ ఆహారపదార్థాలలో పుష్కలంగా ఉండే వర్ణద్రవ్యం గుండె జబ్బులతో పాటు కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడతాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.  వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తి ని పెంపొందించడానికి అద్భుతంగా సహాయపడతాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలతో నైనా సమర్థవంతంగా పోరాడే శక్తి ఈ బ్లాక్ ఫుడ్స్ లో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  ఈరోజు బ్లాక్ కలర్ ఫుడ్స్ తింటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలను చూద్దాం..!

నల్ల నువ్వులు: 

బ్లాక్ ఫుడ్స్ లో నల్ల నువ్వులు ఒకటి. నల్ల నువ్వులు బెల్లం కలుపుకుని తీసుకుంటే రక్తహీనతను నివారిస్తుంది. నల్ల నువ్వుల లో ఐరన్, మెగ్నీషియం, కాపర్, జింక్ సమృద్ధిగా ఉన్నాయి.

బ్లాక్ ఫిగ్స్: 

నల్లని అత్తిపట్టి పండ్లలో ఎముకలకు ఆరోగ్యాన్నిచ్చే ఖనిజాలున్నాయి. అంతేకాదు ఎండిన అత్తి పండ్లలో ఎండుద్రాక్ష లేదా ఖర్జూరం కంటే తక్కువ చక్కెర ఉంటుంది. కనుక షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలైన ఆహారం.

బ్లాక్ వెల్లుల్లి

వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిది, అయితే నల్ల వెల్లుల్లి ఇంకా మంచిదట. ఈ నల్ల వెల్లుల్లి ప్రత్యేకంగా పండదు. ఒక పద్ధతిలో నిల్వచేయడం లేదా అధిక ఉష్ణోగ్రతకు గురిచేయడం ద్వారా నల్లబడేలా చేస్తారు. ఈ వెల్లుల్లి జెల్లీలా సాగుతుంది. అంతగా ఘాటు స్మెల్ ఉండదు. అయితే  ఈ నల్ల వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు అధికం. ప్రొటీన్‌, పీచు, ఐరన్‌, విటమిన్‌-సి, కాల్షియం కూడా అధిక శాతంలోనే ఉంటాయి. ఈ నల్లవెల్లుల్లిని జపాన్‌, థాయ్‌ల్యాండ్‌, దక్షిణ కొరియాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు.

నల్ల పుట్టగొడుగులు

నల్ల పుట్టగొడుగులు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఉదర సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. కాలేయ  పని తీరును మెరుగు పరుస్తాయి.

నల్ల బియ్యం

బ్రౌన్ రైస్ లా.. నల్ల బియ్యం కూడా పురాతన ధాన్యం. ఇవి శాఖాహారులకు మంచి ప్రోటీన్లను ఇచ్చే ఆహారం. వీటిలో  ఆంథోసైనిన్స్  అధికంగా ఉన్నాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. హానికర బ్యాక్టీరియా వైరస్  శరీరంలోకి చేరకుండా చేస్తుంది. ఈ బియ్యంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మధుమేహాన్ని  తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి.

ఇవే కాదు పూర్వకాలం నుంచి వాడుతున్న మినపప్పు, అన్ని సీజన్లోనూ లాభముచే నల్ల ద్రాక్ష, బ్లాక్ బెర్రీస్, ఎండు ఖర్జూరం, నల్ల మిరియాలు, నేరేడు కాయలు, నల్ల సోయాబీన్స్, బ్లాక్ టీ ఇలా అనేక రకాల బ్లాక్ ఫుడ్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. కనుక కలర్ ను చూసి కాకుండా అవి ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని   సాధ్యమైనంతవరకు మీ డైట్ లో భాగంగా చేసుకోండి.

Also Read:  ఈ దేశంలో ఐదురోజులు దీపావళి వేడుకలు.. కాకి, కుక్క, ఎద్దు, ఆవులను పూజించడం ఆచారం..ఎందుకంటే