AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిర్యానీ vs పులావ్.. ఆరోగ్యానికి ఏది మంచిది..? తేడాలు ఏంటి..?

బిర్యానీ, పులావ్ రెండూ రుచికరమైన వంటకాలే అయినా ఆరోగ్యపరంగా కొన్ని తేడాలు ఉంటాయి. బిర్యానీలో అధిక మసాలాలు, నూనె ఉండగా, పులావ్ తేలికగా తక్కువ మసాలాలతో తయారవుతుంది. దీని వల్ల తిన్న తర్వాత శరీరానికి లైట్‌గా అనిపిస్తుంది. మరి మీ ఆరోగ్యానికి ఏది మంచిది..? వీటి మధ్య తేడాలు ఏంటో తెలుసుకుందాం.

బిర్యానీ vs పులావ్.. ఆరోగ్యానికి ఏది మంచిది..? తేడాలు ఏంటి..?
Biryani Vs Pulao
Prashanthi V
|

Updated on: Mar 10, 2025 | 10:28 PM

Share

బిర్యానీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టమైన వంటకం. దాని ఘాటైన మసాలాలు, ప్రత్యేకమైన వాసనలు, రుచికరమైన ముద్దలు విందు భోజనాన్ని తలపిస్తాయి. కానీ బిర్యానీ తరచుగా తినడం శరీరానికి మంచిదేనా..? బదులుగా మరో ఆరోగ్యకరమైన ఎంపిక ఏదైనా ఉందా..? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవల కాలంలో బిర్యానీ తినడం చాలా సాధారణమైంది. ఓసారి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే తినే ఈ వంటకం. ఇప్పుడు వారానికి ఒకట్రెండుసార్లు తినే అలవాటుగా మారిపోయింది. చిన్నపాటి వేడుకలు, బోర్ కొట్టినప్పుడో, కుటుంబ సభ్యులు కలిసి వచ్చినప్పుడో బిర్యానీ ఆర్డర్ చేయడం లేక తయారు చేయడం కామన్ అయిపోయింది. కానీ మితిమీరిన బిర్యానీ భోజనం బరువు పెరగడం, కొలెస్ట్రాల్, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలకు కారణమవుతోంది.

ఈ తరుణంలో బిర్యానీకి ప్రత్యామ్నాయంగా పులావ్ మంచి ఎంపిక. ఇది కూడా రుచికరమే కానీ, అందులో మసాలాలు, నూనె తక్కువగా ఉండటంతో తేలికగా జీర్ణమవుతుంది. పులావ్ తయారీకి ఎక్కువగా కూరగాయలు ఉపయోగించడం వల్ల పోషకాలు శరీరానికి అందుతాయి. వెజిటేబుల్ పులావ్‌ అయితే మరింత ఆరోగ్యకరమైనదని చెప్పొచ్చు.

పులావ్ సాధారణంగా తేలికగా ఉంటుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ వాస్తవానికి ఇది కూడా చాలా రుచికరమైన వంటకమే. దీని ప్రత్యేకత ఏమిటంటే మితమైన మసాలాలతో నెమ్మదిగా ఉడికించబడటమే. దీనికి మంచి కాంబినేషన్‌గా రైతా లేదా పప్పు తినొచ్చు. తేలికపాటి ఘాటుతో కమ్మని వాసనలతో, పులావ్ చాలా సంతృప్తికరమైన వంటకం.

పులావ్ కేవలం వెజిటేరియన్స్‌కే కాదు నాన్‌వెజ్ ప్రియులకు కూడా రుచికరమైన ఆప్షన్లను అందిస్తుంది. మటన్ తెహ్రి, చికెన్ పులావ్, మీట్ బ్రోత్ రైస్ వంటి వంటకాలు, మసాలా ఘాటును తగ్గించి రుచిని పరిపూర్ణంగా అందించేలా చేస్తాయి.

ఇప్పుడు బిర్యానీ ఘాటుగా ఉండగా పులావ్ లైట్‌గా అనిపించడానికి ప్రధాన కారణం తయారీ విధానం. పులావ్ లో అన్నం, కూరగాయలు, మసాలాలను కలిపి వేగంగా ఉడికిస్తారు. కానీ బిర్యానీ ని తయారు చేయడానికి ముందుగా మసాలాలతో మాంసాన్ని మారినేట్ చేసి పొరలుగా (లేయర్లుగా) సిద్ధం చేసి, తక్కువ మంటపై ఉడికిస్తారు. అదనంగా బిర్యానీని ఎక్కువగా బాస్మతి రైస్‌తో చేస్తారు. కానీ పులావ్‌ను వివిధ రకాల రైస్ లతో తయారు చేయవచ్చు. ఈ తేడాలను గుర్తుంచుకుని ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని ఎంచుకోవడం అవసరం.