AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake ORS: నకిలీ ORSలతో జాగ్రత్త.. తేడా వస్తే మెదడుకే ముప్పు

కాస్త నీరసంగా అనిపించినా..ఒళ్లంతా చెమటలు పట్టి ఇబ్బందిగా ఉన్నా..వెంటనే ORS తాగేస్తారు. ఇన్‌స్టంట్‌గా ఎనర్జీ ఇస్తుందని, వెంటనే బాడీ అంతా కంట్రోల్‌లోకి వచ్చేస్తుందని ఇలా చేస్తాం. ఇలాంటి సమయాల్లో డాక్టర్‌ల సూచనతో పని లేకుండా మెడికల్ షాప్‌కి వెళ్లి టెట్రా ప్యాక్‌లు కొనుక్కుని తాగుతుంటారు. జస్ట్ ఆ ప్యాక్‌పై ORS అని కనిపిస్తే చాలనుకుంటారు.

Fake ORS: నకిలీ ORSలతో జాగ్రత్త.. తేడా వస్తే మెదడుకే ముప్పు
Ors
Phani CH
|

Updated on: Jan 22, 2025 | 11:53 AM

Share

కానీ…దీని వెనకాల ఓ పెద్ద నకిలీ వ్యాపారమే జరుగుతోందని తెలిస్తే గుండెలు ఝల్లుమంటాయి. కేవలం ORS అనే పేరు చూసి చాలా మంది మోసపోతున్నారని వైద్యులు చాలా సార్లు హెచ్చరించారు. అయినా..కొందరు తెలిసో తెలియకో ఈ నకిలీ ట్రాప్‌లో చిక్కుకుంటున్నారు. ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లల కోసం కొంటున్న ORS ప్యాకెట్‌లు ప్రమాదకరంగా ఉంటున్నాయన్న కంప్లెయింట్ ఎక్కువగా వినబడుతోంది. పిల్లల ప్యాకెట్‌లలోనే ఎందుకింత కల్తీ జరుగుతోందన్న చర్చ వస్తే..ముందుగా చెప్పుకోవాల్సింది వాటి రుచి గురించే.

ORS అంటే.. Oral Rehydration Salt. ఎప్పుడైనా బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు వీటిని తీసుకుంటారు. అయితే…వీటి రుచి కాస్త వగరుగా ఉంటుంది. ORSలలో గ్లూకోజ్ సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, సోడియం సిట్రేట్ ఉంటాయి. ఈ మూడూ శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడతాయి. వీటి వల్లే రుచి కాస్త అదో రకంగా ఉంటుంది. కానీ… ఇందులోనూ రకరకాల ఫ్లేవర్స్ కలిపి యాపిల్ అని, ఆరెంజ్ అని..మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. కాస్త టేస్టీగా ఉండేలా వీటిని తయారు చేస్తున్నారు. వీటిని ముఖ్యంగా పిల్లల్ని ఉద్దేశించే తయారు చేస్తున్నారు. పిల్లలు ఏ మెడిసిన్‌నైనా కాస్త రుచిగా ఉంటేనే తీసుకుంటారు. అందుకే..ORS లను కూడా అలా మార్చేస్తున్నారు. కాకపోతే.. ఇక్కడే ఓ సమస్య వచ్చి పడుతోంది. వీటిని రుచికరంగా మార్చాలని చెప్పి…విపరీతంగా షుగర్ కంటెంట్ యాడ్ చేస్తున్నారు. అది కూడా మోతాదుకు మించి కలుపుతున్నారు. ఈ విషయంలో ఓ పద్ధతంటూ లేకుండా కంపెనీలు ఇష్టమొచ్చినట్టుగా షుగర్ యాడ్ చేసేస్తున్నాయి. వీటిని తాగడం వల్ల పిల్లల్లో షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి.

షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఇలాంటి డ్రింక్స్ తీసుకోవడం వల్ల రీహైడ్రేషన్‌ అవకపోగా..కొత్తగా డయేరియా లాంటి సమస్యలు వస్తాయి. పైగా..నకిలీ ORSలలో సోడియం లెవల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి వాటిని తాగితే..శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ తప్పుతుంది. ఒక్కోసారి మెదడు వాచిపోయే ప్రాణాలకే ముప్పు వస్తుండొచ్చు. దీంతోపాటు మరి కొన్ని సమస్యలూ వచ్చే ప్రమాదముంది. మార్కెట్‌లో చాలా ఫేక్ ORS ప్రొడక్ట్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. ఒక్కోసారి వాటిని గుర్తించడం కూడా కష్టంగా మారుతోంది. చాలా మంది వీటి గురించి సరైన అవగాహన లేక వాటినే కొని తాగేస్తుంటారు. ఇలాంటి ప్రొడక్ట్స్ విషయంలో కల్తీకి పాల్పడితే అది ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండా కాలంలో వీటికి డిమాండ్ విపరీతంగా ఉన్నప్పటికీ మిగతా రోజుల్లోనూ జ్వరాలు వచ్చినప్పుడు వీటి సేల్స్ పెరుగుతున్నాయి. డాక్టర్లు ఎప్పుడైనా ORS సాచెట్స్ కొనుక్కుని ఆ పౌడర్‌ని నీళ్లలో కలుపుకుని తాగమని సలహా ఇస్తారు. వీటి వల్ల శరీరంలో ఎలక్ట్రో లైట్స్‌, ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి. ఇంత మంచి చేసే ORS లలో నకిలీని గుర్తించడమే చాలా కీలకం. ఇతర వివరాల కోసం ఫుల్ వీడియోను చూడండి..

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రంప్ పలుకే “బంగారం” పెరిగినా..తగ్గినా.. అంతా ఆయన చేతుల్లోనే

Sunita Williams: సునీతా విలియమ్స్‌ స్పేస్‌వాక్‌ చూశారా ??

నడిరోడ్డుపై భారీ దోపిడి.. బైక్‌పై వచ్చి కాల్పులు

H-1B Visa: అమెరికన్‌ ఉద్యోగులకు H1B ముప్పు

మహా కుంభమేళాలో గోల్డెన్‌ బాబా.. ఒళ్లంతా బంగారమే