Brain Health: ఈ ఫుడ్స్ తింటే.. మీ బ్రెయిన్ సూపర్ కంప్యూటర్ లా వర్క్ చేయడం పక్కా.!
మన ఈ హడావిడి జీవితంలో ఒత్తిడి కారణంగా మెదడు పనితీరు తగ్గుతుంది. దీనికి కొన్ని ముఖ్యమైన కూరగాయలు తీసుకోవాల్సిందే. ఈ కూరగాయలను మీ ఆహారంలో చేర్చడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉండి వేగంగా పనిచేస్తుంది. మీ జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఈ పోషకాలు అత్యవసరం. ఆ ముఖ్యమైన కూరగాయలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుత రోజుల్లో మన ఈ బిజీ లైఫ్ తో చాలా మందికి జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది. మానసిక ఒత్తిడి కారణంగా మెదడు పనితీరు తగ్గడం సహజమే. ఆరోగ్యకరమైన శరీరంతో పాటు ఆరోగ్యకరమైన మెదడు కూడా మనకు చాలా అవసరం. మెదడుకు కావాల్సిన పోషకాలను అందించడంలో కొన్ని ముఖ్యమైన కూరగాయలు ఉంటాయి. ఇవి తినడం వల్ల మీ మెదడు కంప్యూటర్ కంటే వేగంగా పనిచేస్తుంది. ఆ కూరగాయలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- క్యారెట్‌లో బీటా కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను రక్షించి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. క్యారెట్‌ను సలాడ్ రూపంలో, సూప్ రూపంలో లేదా స్నాక్‌లా తినవచ్చు.
- బెండకాయలో ఉండే పాలీఫెనాల్స్, విటమిన్ B6 మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. బెండకాయను మీ ఆహారంలో చేర్చడం వల్ల మీ మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. దాన్ని పులుసు, కూర లేదా స్టిర్ ఫ్రైగా తయారుచేసి తినవచ్చు.
- బ్రోకలీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో విటమిన్ K, సెలీనియం, యాంటీఆక్సిడెంట్లు ఉండడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మంచి జ్ఞాపకశక్తి కోసం బ్రోకలీని సలాడ్, సూప్, లేదా స్టిర్ ఫ్రై రూపంలో తినవచ్చు.
- పాలకూరలో విటమిన్ A, కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడుకు తగినంత శక్తిని అందించడంలో సహాయపడతాయి. పాలకూరను మీ రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. పాలకూరతో సూప్, కూరగాయల కూరలు తయారుచేసి తినవచ్చు.
- టమాటాలో ఉండే లైకోపీన్ అనే పోషకం మెదడు కణాలను రక్షిస్తుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. టమాటాలను సూప్, సలాడ్, చట్నీ లేదా కూరల్లో ఉపయోగించి ఆహారంలో చేర్చుకోవచ్చు.
పై చెప్పిన కూరగాయలను మీ రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా మీ మెదడుకు సరైన పోషకాలను అందించవచ్చు. ఇవి అనుసరించి మీ ఆరోగ్యం, జ్ఞాపకశక్తిని మెరుగుపరచండి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




