AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మధుమేహానికి దివ్యౌషధం ఈ కూరగాయ.. రాత్రి భోజనంలో తింటే ఉదయానికి బ్లడ్ షుగర్ పూర్తిగా అదుపులోకి..!

దొండకాయ తినడం వల్ల ఎముకలకు చాలా మేలు చేస్తుంది. ఈ కూరగాయలలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఐరన్, కాల్షియం వంటి అనేక విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని నివారిస్తుంది. మీ ఎముకలు బలహీనంగా ఉంటే, మీరు దొండకాయ తినడం అలవాటు చేసుకోవచ్చు. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి కూడా దొండకాయ అద్భుతమైనది.

మధుమేహానికి దివ్యౌషధం ఈ కూరగాయ.. రాత్రి భోజనంలో తింటే ఉదయానికి బ్లడ్ షుగర్ పూర్తిగా అదుపులోకి..!
దొండకాయల్లో ఉండే బీటా కెరోటిన్‌ శరీరంలో విటమిన్‌- ఏగా రూపాంతరం చెందుతుది. ఇది కంటి సమస్యలను దూరం చేయడంలో సహాయపడతుంది. దొండకాయలు తింటే కంటి సమస్యలు రావు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని తగ్గించడానికి సహాయపడతాయి.
Jyothi Gadda
|

Updated on: Jan 21, 2025 | 9:16 PM

Share

మధుమేహంతో బాధపడేవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి అజాగ్రత్త వారిని తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవటం తప్పనిసరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా చేయడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. డయాబెటిక్ రోగులకు కొన్ని కూరగాయల వినియోగం చాలా ప్రయోజనకరం అంటున్నారు నిపుణులు. అలాంటి వాటిలో దొండకాయ ఒకటి. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఈ కూరగాయ మధుమేహ రోగులకు అమృతంలాంటిది అంటున్నారు నిపుణులు. దొండకాయలో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక తీవ్రమైన వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. దొండకాయ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. మధుమేహాన్ని నియంత్రించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కూరగాయలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటుంది.

దొండకాయ కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. ఇది ఫైబర్ మంచి మూలం. దొండకాయ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్) స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు..దొండకాయ గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దొండకాయ కూడా తినొచ్చు. దొండకాయ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్తి సమస్యలు దూరమవుతాయి. చర్మ సమస్య తామర నుండి ఉపశమనం పొందడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

దొండకాయ తినడం వల్ల ఎముకలకు చాలా మేలు చేస్తుంది. ఈ కూరగాయలలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఐరన్, కాల్షియం వంటి అనేక విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని నివారిస్తుంది. మీ ఎముకలు బలహీనంగా ఉంటే, మీరు దొండకాయ తినడం అలవాటు చేసుకోవచ్చు. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి కూడా దొండకాయ అద్భుతమైనది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి
గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!
గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!
ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!
ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!
ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!
ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!
24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.
కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.
బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?
బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?
నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన
నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన
భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?
భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?
లియోనెల్‌ మెస్సీ నెట్‌వర్త్‌ చూస్తే కళ్లు తిరగాల్సిందే..!
లియోనెల్‌ మెస్సీ నెట్‌వర్త్‌ చూస్తే కళ్లు తిరగాల్సిందే..!