AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షుగర్ పేషెంట్లకు ఈ డ్రైఫ్రూట్‌ ఒక వరం.. వీటిని తింటే షుగర్ లెవల్స్ అస్సలు పెరగవు..!

మధుమేహం..దీనినే డయాబెటిస్‌ అని కూడా అంటారు.. నయం చేయలేని ఈ చక్కెర వ్యాధి గురించి పట్టించుకోకపోతే మాత్రం ఆరోగ్యానికి పెను ప్రమాదం పొంచివున్నట్టే. దీన్ని నియంత్రించడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని రకాల పండ్లు, కూరగాయలతో పాటు ప్రత్యేకించి డ్రైఫ్రూట్స్‌ కూడా తీసుకోవటం మంచిది అంటున్నారు నిపుణులు. వీటితో డయాబెటీస్ కంట్రోల్ లో ఉంటుంది. అలాంటి డ్రై ఫ్రూట్‌ ఏంటంటే..

షుగర్ పేషెంట్లకు ఈ డ్రైఫ్రూట్‌ ఒక వరం.. వీటిని తింటే షుగర్ లెవల్స్ అస్సలు పెరగవు..!
Pistachios
Jyothi Gadda
|

Updated on: Jan 21, 2025 | 7:48 PM

Share

అన్ని రకాల డ్రైఫ్రూట్స్‌ లో పిస్తా కూడా ఒకటి.. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం పిస్తాపప్పు వాత దోషం నుండి ఉపశమనం కలిగిస్తాయి. పిస్తాలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని అనేక సమస్యల నుండి కాపాడతాయి. పిస్తాపప్పులు కూడా కళ్లకు చాలా మేలు చేస్తాయి. అంతే కాదు రక్తపోటు, కొలెస్ట్రాల్, ఊబకాయాన్ని నియంత్రిస్తుంది.

యాబెటిస్‌కు ఉపయోగపడుతుంది: పిస్తాపప్పు తీసుకోవడం మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. పిస్తాలు చాలా ఆరోగ్యకరమైన డ్రైఫ్రూట్‌. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.

కళ్లకు ఉపయోగపడుతుంది: పిస్తాలో లుటిన్, జియాక్సంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. పిస్తాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల చూపు మెరుగుపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఊబకాయం: మీరు బరువు తగ్గాలనుకుంటే పిస్తా మీకు చాలా సహాయపడుతుంది. ఇది మొక్కల ఆధారిత ప్రోటీన్‌కు మంచి మూలం. పిస్తాలను మితంగా తినడం వల్ల బరువు తగ్గుతారు.

ఎముకలకు ఉపయోగపడుతుంది: పిస్తాపప్పులు ఎముకలను పటిష్టం చేయడంలో సహకరిస్తాయి. పిస్తాలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.

కొలెస్ట్రాల్: మీరు రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రించాలనుకుంటే, మీ ఆహారంలో పిస్తాలను చేర్చుకోవచ్చు. పిస్తాపప్పులో ఉండే సమ్మేళనాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ: పిస్తాపప్పు తినడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది. పిస్తాలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

ఇమ్యూనిటీ బూస్టర్: పిస్తాలో ఉండే టోకోఫెరోల్ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థ అనేక ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..