Better Sleep: రాత్రుల్లో సరైన నిద్ర రాక ఇబ్బందులు పడుతున్నారా..? ఈ చిట్కాలు పాటించండి
మీరు రోజంతా పని చేసి అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు మీ శరీరం మంచి విశ్రాంతి కోరుకుంటుంది. రాత్రి త్వరగా నిద్రపోవాలని అనుకున్నా.. కొందరికి నిద్రరాదు. నిద్రలేకపోవడం వల్ల..
మీరు రోజంతా పని చేసి అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు మీ శరీరం మంచి విశ్రాంతి కోరుకుంటుంది. రాత్రి త్వరగా నిద్రపోవాలని అనుకున్నా.. కొందరికి నిద్రరాదు. నిద్రలేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. సమయానికి పడుకున్న తర్వాత కూడా రాత్రిపూట సుఖంగా నిద్రపోకుండా, గంటల తరబడి అటూ ఇటూ తిరుగుతూ కష్టపడేవాళ్లు ఎందరో ఉన్నారు. పడుకునే ముందు వేడి నీళ్లతో స్నానం చేస్తే మంచి నిద్ర వస్తుంది. బిజీగా ఉన్న రోజు తర్వాత మానసికంగా, శారీరకంగా విశ్రాంతి తీసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మంచి నిద్రతో పాటు ఒత్తిడిని పూర్తిగా తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. కాలి నొప్పి, కండరాల నొప్పులను తగ్గిస్తుంది. దీనితో పాటు, ఇది నరాలు, కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది.
అధ్యయనం ఏం చెబుతోంది?
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ నర్సింగ్ స్టడీస్‌లో ప్రచురించబడిన 2013 అధ్యయనం ప్రకారం.. పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో మీ చేతులు, కాళ్ళను నానబెట్టడం వల్ల మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. దీని వల్ల నిద్ర త్వరగా వస్తుంది. మరోవైపు, పాదాలను నీటిలో నానబెట్టడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది హార్మోన్ మెలటోనిన్‌ను విడుదల చేయడానికి మెదడుకు సంకేతాలను పంపడంలో సహాయపడుతుంది.
గోరువెచ్చని ఉప్పునీటిలో పాదాలను నానబెట్టడం వల్ల ఉపశమనం లభిస్తుంది. కండరాల నొప్పులు, అలసట నుండి ఉపశమనం పొందవచ్చు. ఇది మంచి నిద్ర పొందడానికి సహాయపడుతుంది. మీరు పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో మీ పాదాలను నానబెట్టినట్లయితే అది హృదయ స్పందన రేటును మెరుగుపరుస్తుంది. అలాగే శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని ప్రశాంతపరుస్తుంది. మీరు వేగంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి