స్నానం చేయడం అనేది మన రోజువారీ కార్యకలాపంలో భాగం. శరీరం శుభ్రత, తాజాదనాన్ని పొందడానికి ఈ పని చాలా ముఖ్యం. దీంతో మురికి వల్ల వచ్చే వ్యాధులకు దూరంగా ఉంటూ ఉల్లాసంగా ఉంటాం. ఒక్కొక్కరి స్నానం చేసే విధానం ఒక్కో రకంగా ఉంటుంది. కొందరు బకెట్‌లో నీళ్లు నింపుకుని స్నానం చేస్తారు. మరి కొందరు షవర్ కింద స్నానం చేస్తారు. మరికొందరు బాత్‌టబ్ సహాయం తీసుకుంటారు. అయితే స్నానం చేసే నీటిలో కొన్ని వస్తువులను కలపడం వల్ల రోజంతా హుషారుగా ఉండడమే కాకుండా వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.