Telugu News » Photo gallery » Dates and Milk Health Benefits in Winter Controlling BP to improving digestion
ఆరోగ్యానికి కేరాఫ్ అడ్రస్.. ఖర్జూరా పాలు.. అద్భుతమైన ప్రయోజనాలు పొందాలంటే ఇలా చేయండి చాలు..
Shaik Madarsaheb |
Updated on: Nov 27, 2022 | 1:45 PM
శీతాకాలం ప్రారంభమైన నాటినుంచి అనేక శారీరక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, సీజనల్ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అయితే.. కొన్ని చిట్కాలను అనుసరించడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
Nov 27, 2022 | 1:45 PM
శీతాకాలం ప్రారంభమైన నాటినుంచి అనేక శారీరక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, సీజనల్ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అయితే.. కొన్ని చిట్కాలను అనుసరించడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. చలికాలంలో రోజూ రెండు ఖర్జూరాలు తినడం వల్ల అనేక వ్యాధుల నుంచి ఆరోగ్యంగా ఉండొచ్చంటున్నారు.
1 / 6
ఖర్జూరాలలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. సాధారణంగా రోజూ రెండు ఖర్జూరాలు తింటే చలికాలంలో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కావాలంటే ఖర్జూరాలను విడిగా.. లేదా వేడి పాలతో మరిగించి కూడా తినవచ్చు. ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
2 / 6
Bp
3 / 6
చలికాలంలో అజీర్ణం ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఆహారం తిన్న తర్వాత ఎసిడిటీ, గుండెల్లో మంటతో బాధపడుతుంటారు. ఇలాంటి సందర్భంలో డేట్స్ (ఖర్జూరా పండు) చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మీరు అజీర్తి, కడుపు సమస్యలను నివారించడానికి ఖర్జూరాలను తినవచ్చు.
4 / 6
Dates
5 / 6
ఉష్ణోగ్రత మారినప్పుడు జలుబు, దగ్గు సమస్యలు ఎక్కువ అవుతాయి. అంతేకాకుండా, జ్వరం, తలనొప్పి, శారీరక బలహీనత వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ సందర్భంలో ఖర్జూరాలు మన శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి.