Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green Coffee: కాఫీలో ఎన్నో రకాలున్నాయి.. కానీ.. ఈ కాఫీతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా?

ఒక కప్పు వేడి కాఫీ మిమ్మల్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. మార్కెట్లో అనేక రకాల కాఫీలు అందుబాటులో ఉన్నాయి.

Green Coffee: కాఫీలో ఎన్నో రకాలున్నాయి.. కానీ.. ఈ కాఫీతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా?
Green Coffee
Follow us
KVD Varma

|

Updated on: Dec 12, 2021 | 5:48 PM

Green Coffee: ఒక కప్పు వేడి కాఫీ మిమ్మల్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. మార్కెట్లో అనేక రకాల కాఫీలు అందుబాటులో ఉన్నాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందిన వాటిలో ఒకటి గ్రీన్ కాఫీ. జీవక్రియను పెంచడం, ఒత్తిడిని తగ్గించడం.. బరువు తగ్గించడం వంటి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఇది అందిస్తుంది. గ్రీన్ కాఫీ మీరు శక్తివంతంగా ఉండటానికి సహాయపడుతుంది. సాధారణ కాఫీలా కాకుండా, గ్రీన్ కాఫీ గింజలు కాల్చరు. పూర్తిగా పచ్చిగా ఉంటాయి. అందువలన గ్రీన్ కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ అనే రసాయనం ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇందులో కాల్చిన కాఫీ కంటే తక్కువ కెఫీన్ ఉంటుంది. దాని ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

గ్రీన్ కాఫీ 5 ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది

గ్రీన్ కాఫీ గింజలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. క్లోరోజెనిక్ యాసిడ్ ఉండటం వల్ల కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడుతుంది. గ్రీన్ కాఫీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. అందువలన, ఇది బరువు తగ్గడానికి, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది.

రక్తంలో చక్కెరను నియంత్రించడానికి

గ్రీన్ కాఫీ గింజల్లో క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, గ్రీన్ కాఫీ వంటి ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను చాలా వరకు బ్యాలెన్స్ చేయవచ్చు.

రక్తపోటును నియంత్రించడానికి

గ్రీన్ కాఫీ అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది రక్త నాళాలను విస్తరిస్తుంది. రక్తపోటును పెంచే కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిని తగ్గిస్తుంది. రోజూ గ్రీన్ కాఫీ తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

క్యాన్సర్ నిరోధించడానికి

గ్రీన్ కాఫీ గింజలలో అవసరమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కోవడంలో సహాయపడతాయి. ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. అధ్యయనాల ప్రకారం, గ్రీన్ కాఫీ గింజలలోని క్లోరోజెనిక్ యాసిడ్ ట్యూమర్ సెల్స్ ఏర్పడకుండా.. క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది.

నిర్విషీకరణి(డిటాక్సిఫైయర్‌) గా..

గ్రీన్ కాఫీ గింజలు సహజమైన డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తాయి. ఇవి శరీరం నుంచి టాక్సిన్స్, అదనపు కొవ్వు, కొలెస్ట్రాల్‌ను బయటకు పంపడంలో సహాయపడతాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

ఇవి కూడా చదవండి: America Hurricane: విరుచుకుపడిన హరికేన్లతో అమెరికాలో ఆరు రాష్ట్రాలు అతలాకుతలం.. ఫోటోలలో తుపాను విధ్వంసం చూడండి!

Omicron Stealth: వామ్మో.. ఆ దేశాల్లో ఒమిక్రాన్ కొత్త వెర్షన్ జాడలు..మామూలు టెస్టులకు ఇది చిక్కడంలేదంటున్న నిపుణులు!