Coffee Benefits and Side Effects: రోజూ కాఫీ తాగుతున్నారా.. దీనివల్ల మీ ఎత్తు ఆగిపోతుందా? అసలు నిజం ఏంటి?
కాఫీ.. ఇది పడక పోతే కొంత మందికి రోజు గడవదు. అంతగా ఎడిక్ట్ అయిపోతారు కాఫీకి. ఉదయం, సాయంత్రం అయ్యిందంటే కాఫీ కోసం ఎదురు చూస్తూంటారు. అలా ఒక్క సిప్ వేస్తేనే గానీ వీరికి ప్రశాంతంగా ఉండదు. ఒక్క కప్పు కాఫీ తాగితే కానీ మైండ్ సెట్ అవ్వదు. నిజానికి ఈ లక్షణాలు అన్నీ ఎడిక్ట్ అయిపోవడమే అంటున్నారు నిపుణులు. కాఫీతో పాజిటివ్ తో పాటు నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయన్న సంగతి తెలుసు. అయితే క్రమం తప్పకుండా కాఫీ తాగితే మాత్రం మీ ఎత్తు ఆగిపోతుందని, గుండె..

కాఫీ.. ఇది పడక పోతే కొంత మందికి రోజు గడవదు. అంతగా ఎడిక్ట్ అయిపోతారు కాఫీకి. ఉదయం, సాయంత్రం అయ్యిందంటే కాఫీ కోసం ఎదురు చూస్తూంటారు. అలా ఒక్క సిప్ వేస్తేనే గానీ వీరికి ప్రశాంతంగా ఉండదు. ఒక్క కప్పు కాఫీ తాగితే కానీ మైండ్ సెట్ అవ్వదు. నిజానికి ఈ లక్షణాలు అన్నీ ఎడిక్ట్ అయిపోవడమే అంటున్నారు నిపుణులు. కాఫీతో పాజిటివ్ తో పాటు నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయన్న సంగతి తెలుసు. అయితే క్రమం తప్పకుండా కాఫీ తాగితే మాత్రం మీ ఎత్తు ఆగిపోతుందని, గుండె జబ్బులు వస్తాయని.. పెద్దలు అంటూంటారు. మరి ఇది నిజమా? అపోహా? ఇప్పుడు తెలుసుకుందాం.
మోతాదుకు మించితే విషమే:
ఎప్పుడైనా సరే మోతాదుకు మించి తీసుకుంటే అది విషమే అవుతుంది. కాఫీ కూడా అంతే కెఫిన్ ని సరైన మోతాదులో ఉపయోగించుకుంటే ఆరోగ్యానికి మంచిదే. అంతకు మించి వాడితేనే చాలా రకాల అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టే.
కాఫీ తాగితే ఎత్తు ఆగిపోతుందా?
పిల్లలు, యుక్త వయసులో ఉన్నవారు కాఫీ తాగితే ఎదుగుదలను అడ్డుకుంటుందన్న దానికి శాస్త్రీయ ఆధారాలు లేవన్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లీనికల్ న్యూట్రిషన్ లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. పిల్లలు, యుక్త వయసులో ఉన్నవారు కాఫీ తాగితే.. వారి ఎత్తుపై ఎలాంటి ప్రభావాన్ని చూపదని తేలింది.
ఎక్కువగా కాఫీ తాగితే గుండెను ఒత్తిడికి గురి చేస్తుందా?
కాఫీ ఎక్కువగా తాగడం వల్ల గుండె ఒత్తిడికి గురవుతుందని చాలా మంది అంటూంటారు. కానీ ఇది నిజం కాదని తేలింది. తక్కువ మోతాదులో కాఫీని తాగడం వల్ల హృదయ నాళాలు చురుగ్గా పని చేస్తాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు గుండె జబ్బులు, స్ట్రోక్ ని తగ్గిస్తుందట.
మైండ్ ని రిలాక్స్ చేస్తుంది:
కాఫీ తాగడం మంచిదే. కాఫీలో ఉండే కెఫిన్.. నర్వస్ సిస్టమ్ పై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి బ్రేయిన్, శరీరాన్ని యాక్టీవ్ గా చేస్తుంది. మూడ్ ని కూడా ఇట్టే మార్చేస్తుంది. అటెన్షన్ ని కూడా పెంచుతుంది.
రెండు కప్పుల కంటే ఎక్కువ తీసుకోకూడదు:
సాధారణంగా మనిషి రోజుకు రెండు కప్పుల కాఫీ తీసుకుంటే మంచిదే. ఇలా తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఈ మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా గుండె సమస్యలు వస్తాయి. గుండెకు రక్త సరఫరా ఆగిపోవడం, నిద్రలేమి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఒత్తిడి, డిప్రెషన్ లోకి కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.




