AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hot water Bath: వేసవిలో వేడి నీటి స్నానం.. ఆరోగ్యానికి మంచిదేనా.. పూర్తి వివరాలివే

బయట ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగ మండుతూ నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. దీంతో జనం బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరైనా సరే.. చల్లని నీటితో స్నానం చేసేందుకు మొగ్గుచూపుతారు....

Hot water Bath: వేసవిలో వేడి నీటి స్నానం.. ఆరోగ్యానికి మంచిదేనా.. పూర్తి వివరాలివే
Hot Water Bath
Ganesh Mudavath
|

Updated on: Apr 01, 2022 | 8:32 PM

Share

బయట ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగ మండుతూ నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. దీంతో జనం బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరైనా సరే.. చల్లని నీటితో స్నానం చేసేందుకు మొగ్గుచూపుతారు. కానీ కొందరికి మాత్రం సీజన్‌తో సంబంధం లేకుండా వేడి నీటి స్నానం(Hot Water bath) చేయడం అలవాటు. అయితే వేసవిలో వేడి నీటి స్నానం చేస్తే ఆరోగ్యానికి(Health) మంచిదా.. కాదా.. అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. అయితే వేసవిలో వేడి నీటి స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు అంటున్నారు. వాస్తవానికి వేసవిలో చల్లని నీటితో స్నానం చేయడం హాయిగా అనిపిస్తుంది. మన పూర్వీకులు కూడా చన్నీటి స్నానానికి ఇష్టపడేవారు. అయితే గోరు వెచ్చని(Warm water bath) నీటితో స్నానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేడి నీటి స్నానం కండరాలను రిలాక్స్ చేస్తాయి. నొప్పులు కూడా తగ్గుతాయి. వేసవి కాలంలో చాలామంది ఏసీ వేసుకుని నిద్రపోతారు. దీనివల్ల జలుబు, తుమ్ములు, దగ్గు వచ్చే అవకాశం ఉంది. అవి రాకుండా ఉండాలంటే ఉదయాన్నే వేడి నీటి స్నానం చేయడం ఉత్తమం. వేడి నీటి స్నానం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. చర్మం బాగా శుభ్రమవుతుంది. వేడి నీరు చర్మ రంధ్రాలను మరింత లోతుగా శుభ్రం చేస్తుంది.

వేడినీటి స్నానం ఎంత ఉపయోగకరమో అంతే ప్రమాదకరం కూడా.. అందుకే వేడి నీటి స్నానం చేసే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అయితే వేడినీటి స్నానంతో జరిగే నష్టాలేంటేంటే.. వేడి నీరు చర్మాన్ని పొడిబారేలా చేస్తుంది. కాబట్టి మరిగే నీటితో స్నానం చేయకుండా గోరు వెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయాలి. బాగా మరిగిన నీటితో తలస్నానం చేస్తే తల పొడిబారి చుండ్రు వచ్చే అవకాశాలున్నాయి. శరీరానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియా చనిపోతుంది.

(ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం నిపుణుల సూచనల మేరకే.. TV9 తెలుగు వీటిని ధృవీకరించడంలేదు. నిపుణులను సంప్రదించిన తర్వాత దీన్ని అనుసరించడం మంచిది.)

Also Read

Ramadan 2022: ఈ పవిత్ర మాసంలో ముస్లింలు ఖర్జూరంతోనే ఉపవాసం విరమిస్తారు.. కారణమేంటో తెలుసా?

Health Benefits : రాత్రి పూట ఇవి తినడం వల్ల దిమ్మతిరిగే లాభాలు ఉంటాయట..

Silly Robbery: వీడో విచిత్ర దొంగ.. 3 షాపుల్లో లూటీ.. 20 రూపాయలు చోరీ.. కారణం తెలిస్తే బిత్తరపోతారు..!

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ