Health: తల్లిగా ప్రమోషన్‌ కొట్టేయాలనుకుంటున్నారా.? అయితే ముందు ఈ జాగ్రత్తలు పాటించండి.

Health: తల్లిగా మారాలని ప్రతీ మహిళ కోరుకుంటుంది. తన రూపానికి మరో రూపం ఇచ్చే అద్భుత క్షణాన్ని ఎంతో సంతోషంగా ఆస్వాదిస్తుంది. ఎంతో కష్టానికి ఓర్చుకొని బిడ్డుకు జన్మనివ్వాలని ఆశిస్తుంటుంది. అయితే మారుతోన్న జీవనశైలి...

Health: తల్లిగా ప్రమోషన్‌ కొట్టేయాలనుకుంటున్నారా.? అయితే ముందు ఈ జాగ్రత్తలు పాటించండి.
Health Tips
Follow us

|

Updated on: Feb 26, 2022 | 1:58 PM

Health: తల్లిగా మారాలని ప్రతీ మహిళ కోరుకుంటుంది. తన రూపానికి మరో రూపం ఇచ్చే అద్భుత క్షణాన్ని ఎంతో సంతోషంగా ఆస్వాదిస్తుంది. ఎంతో కష్టానికి ఓర్చుకొని బిడ్డుకు జన్మనివ్వాలని ఆశిస్తుంటుంది. అయితే మారుతోన్న జీవనశైలి (Life Style), వృత్తిపరమైన కారణాలతో ఈ మధ్యకాలంలో కొందరు మహిళలు ఆరోగ్యాన్ని (Women Health)  నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ కారణంగా పుట్టబోయే బిడ్డపై కూడా దాని ప్రభావం స్పష్టంగా పడుతోంది. అయితే బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమయ్యే ముందు ప్రతీ మహిళ కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే కాబోయే తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఓ లుక్కేయండి..

  1. కాబోయే తల్లులు కచ్చితంగా తమ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీకి ప్లానింగ్ చేస్తున్న సమయంలోనే డయాబెటిస్‌, థైరాయిడ్, బీపీ, సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ రోగాల పరీక్షలను చేయించుకోవాలి. వీటిలో ఏ సమస్యతో బాధపడుతోన్నా ముందుగా వాటికి సంబంధించి చికిత్స తీసుకున్న తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోవాలి.
  2.  ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కు ముందు మహిళలు తగినంత ఫోలిక్‌ యాసిడ్‌ను తీసుకోవాలి. దీనివల్ల భవిష్యత్తుల్లో చిన్నపిల్లలో వచ్చే మెదడు, వెన్నుపూస సంబంధిత సమస్యలు దరిచేరకుండా జాగ్రత్త పడవచ్చు. అయితే ఇది కచ్చితంగా వైద్యుల సూచనమేరకే తీసుకోవాలి.
  3.  తల్లులుగా మారాలనుకుంటున్న మహిళలకు ఒకవేళ మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లు ఉంటే ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసే కొన్ని నెలల ముందు నుంచి వాటిని పూర్తిగా మానేయాలి. వీటి కారణంగా పిల్లలు నెలలు నిండకుండానే పుట్టడం, తక్కువ బరువుతో పుట్టడం, చిన్నారుల్లో శ్వాస సంబంధిత వ్యాధులు, గర్భస్రావం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి.
  4.  కాబోయే తల్లులు ఆహారం విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్‌ ఉండేలా చూసుకోవాలి. ఇక ప్రెగ్నెన్సీకి ప్లాన్‌ చేసే కొన్ని నెలల ముందు నుంచి జంక్‌ ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి ముఖ్యంగా పిజ్జా, న్యూడుల్స్‌, బర్గర్, కాఫీ, సోడా వంటి వాటిని తీసుకోకూడదు.
  5.  ఆహార నియమాలతో పాటు వ్యాయమం కూడా తప్పనిసరి. శారీరక, మానసిక ఆరోగ్యం బాగుండాలంటే కాబోయే తల్లులు వ్యాయామాన్ని నిత్యకృత్యంగా మార్చుకోవాలి. నడక, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌, యోగా వంటివి చేయాలి. అయితే గర్భం దాల్చిన తర్వాత మాత్రం వ్యాయామాలు చేసే విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

నోట్‌: పైన తెలిపిన సూచనలన్నీ ప్రాథమిక సమాచారం ఆధారంగా ఇవ్వడం జరిగింది. అయితే గర్భం దాల్చడానికి ప్లానింగ్ చేసుకుంటున్న మహిళలు కచ్చితంగా ముందు వైద్యులను సంప్రదించాలి. మీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని అంచనా వేసి వైద్యులు సరైన డైట్‌ ప్లాన్‌తో పాటు పలు జాగ్రత్తలు చెబుతారు.