నిశ్శబ్దంగా ఉండటం వల్ల అద్భుతమైన శక్తి లభిస్తుందన్న విషయం మీకు తెలుసా.. అంతే కాదు ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. నిజమా అని ఆశ్చర్యపోతున్నారా! ఇటీవల చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. నిశ్శబ్దంగా ఉండటం వల్ల అద్భుతమైన శక్తిని సంపాదించవచ్చట. రోజూ ఒక గంట సేపు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉండం.. ఏకాగ్రత, నిశ్చలతలు, స్థిరత్వం, రోగ నిరోధక శక్తి అనేవి బలోపేతం అవుతాయి. దీని వల్ల మానసిక ఆరోగ్యమే కాకుండా.. శరీరానికి కూడా ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయట. ప్రతి రోజూ ఒక గంట సేపు మౌనంగా.. ప్రశాంతంగా ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఒత్తిడి నుంచి ఉపశనం లభిస్తుంది:
ఒక గంట సేపు ఎలాంటి విషయాల గురించి ఆలోచించకుండా.. ప్రశాంతంగా ఉండటం వల్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, భయం మొదలైన వాటిని నుంచి రిలీఫ్ పొందవచ్చు. నిశ్శబ్దంగా ఉండటం వల్ల ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించుకోవచ్చు. దీంతో స్ట్రెస్ అనేది తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
గుండె సమస్యల ముప్పు తగ్గుతుంది:
రోజూ ఒక గంట సేపు మౌనంగా, ప్రశాంతంగా ఉండటం వల్ల గుండె సమస్యల ముప్పు తగ్గుతుందట. అంతే కాకుండా గుండె ఆరోగ్యంగా పని చేస్తుందని అధ్యయనాల్లో తేలింది. రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుందట.
క్రియేటివిటీ పెరుగుతుంది:
నిశ్శబ్దంగా ఉండటం వల్ల క్రియేటివిటీ థాట్స్ అనేవి పెరుగుతాయి. కళాకారులు, రైటర్స్ వీలైనంత వరకూ ప్రశాంతంగా ఉంటారు. ఇలా ఉండటం వల్ల క్రియేటివిటీ ఆలోచనలు వస్తాయి.
కమ్యునికేషన్ స్కిల్స్ పెరుగుతాయి:
నిశ్శబ్దంగా ఉండటం వల్ల కమ్యునికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. నిశ్బబ్దంగా ఉండి మీరు మాట్లాడే ప్రతి పదాలను మరింత జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడతారు. అలాగే శ్రద్ధగా వినడం వంటివి నేర్చుకుంటారు. అవగాహన సానుభూతిని పెంపొందించుకోవడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది.
నిద్రను మెరుగు పరుస్తుంది:
నిశ్శబ్దంగా ఉండటం వల్ల నిద్ర మెరుగు పడుతుంది. మంచి నిద్ర వల్ల మనసు కూడా రిలాక్స్ గా ఉంటుంది. దీంతో ఇతర సమస్యలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది.
బీపీ కంట్రోల్ అవుతుంది:
ప్రతి రోజు గంట సేపు మాట్లాడకుండా, ప్రశాంతంగా ఉండే.. బీపీ వంటి సమస్యల ముప్పు కూడా తగ్గుతుంది. బీపీ అదుపులోకి వస్తుంది. దీని వల్ల గుండె సమస్యలు, హార్ట్ స్ట్రోక్ వంటికి రాకుండా ఉంటాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.