Child Care Tips: మీ పిల్లలు కూడా నోట్లో వేలు పెట్టుకుంటున్నారా? ఇలా ఈజీగా ఆ అలవాటును మాన్పించండి..
తల్లిదండ్రులు కూడా దీనిని పెద్దగా పట్టించుకోరు. నిర్లక్ష్యం చేస్తుంది. కానీ పిల్లల ఈ అలవాటు వారి ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, చిన్న పిల్లలు నోటిలో వేళ్లు పెట్టుకోవడం వలన చాలా బ్యాక్టీరియా నోటిలోకి ప్రవేశిస్తుంది. దీని వల్ల దంతాలు పుచ్చిపోవడమే కాకుండా కడుపు సంబంధిత వ్యాధులు కూడా పిల్లలను ప్రభావితం చేస్తాయి. అందుకే, తల్లిదండ్రులు పిల్లల ఈ అలవాటును మాన్పించడం చాలా ముఖ్యం. అంతకంటే ముందు చిన్నపిల్లలు తమ వేళ్లను ఎందుకు నోట్లో పెట్టుకుంటున్నారు? అనే కారణాలను...
చాలా మంది పిల్లలకు బొటనవేలును, ఇతర వేళ్లను నోట్లో పెట్టుకుంటారు. చిన్న పిల్లలలో ఇది సాధారణం. తల్లిదండ్రులు కూడా దీనిని పెద్దగా పట్టించుకోరు. నిర్లక్ష్యం చేస్తుంది. కానీ పిల్లల ఈ అలవాటు వారి ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, చిన్న పిల్లలు నోటిలో వేళ్లు పెట్టుకోవడం వలన చాలా బ్యాక్టీరియా నోటిలోకి ప్రవేశిస్తుంది. దీని వల్ల దంతాలు పుచ్చిపోవడమే కాకుండా కడుపు సంబంధిత వ్యాధులు కూడా పిల్లలను ప్రభావితం చేస్తాయి. అందుకే, తల్లిదండ్రులు పిల్లల ఈ అలవాటును మాన్పించడం చాలా ముఖ్యం. అంతకంటే ముందు చిన్నపిల్లలు తమ వేళ్లను ఎందుకు నోట్లో పెట్టుకుంటున్నారు? అనే కారణాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
పిల్లలు తమ వేళ్లను ఎందుకు నోట్లో పెట్టుకుంటారు?
ఆకలి: కొన్నిసార్లు పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు కూడా తమ బొటనవేళ్లను నోట్లో పెట్టుకుని చప్పరిస్తుంటారు. అందుకే శిశువుకు సమయానికి ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యం.
ఒత్తిడి: ఒత్తిడి పెద్దలనే కాదు పిల్లలను కూడా ప్రభావితం చేస్తుంది. చాలా మంది ఒత్తిడికి గురైనప్పుడు ఎక్కువగా తింటుంటారు. అదేవిధంగా, చిన్న పిల్లలు కూడా ఆహారం కోసం వెతుకుతారు. వారి చుట్టూ ఆహారం అందుబాటులో లేనప్పుడు వారు తమ బొటనవేళ్లను నోట్లో పెట్టుకుని కొరకడం చేస్తుంటారు.
అభద్రతా భావం: కొన్నిసార్లు పిల్లలు తమ తల్లిదండ్రులకు దూరంగా గంటల తరబడి ఉండడం వల్ల ఇంట్లోనే అభద్రతా భావంతో ఉంటారు. ఒంటరితనంతో వారు బాధపడుతుంటారు. అలాంటి సందర్భంలో పిల్లలు తమ బొటనవేళ్లను చప్పరిస్తారు.
పిల్లల ఈ అలవాటును ఎలా వదిలించుకోవాలి?
తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి: ఒక పిల్లవాడు ఒంటరిగా అనిపించినప్పుడు బొటనవేలు కొరకడం ప్రారంభిస్తాడు. పిల్లల ఈ అలవాటును వదిలించుకోవడానికి, పిల్లల తల్లిదండ్రులు ఆ పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. దీనివల్ల బిడ్డ ఒంటరితనం అనుభూతి చెందడు.
సమయానికి తినడానికి ఆహారం పెట్టాలి: చిన్న పిల్లలు తరచుగా ఆకలితో ఉంటారు. చాలా మంది పిల్లలు ఆకలిగా ఉన్నప్పుడు వేళ్లు నోట్లో పెట్టుకుంటారు. అందుకే, పిల్లలకు ప్రతిసారీ ఆరోగ్యకరమైన చిరుతిండి, పాలు లేదా పండ్లను ఇవ్వండి. పిల్లలు తమ నిండుగా ఉంటే నోట్లో వేళ్లు పెట్టుకోరు.
వేప, నిమ్మకాయ: పిల్లలు అతిగా బొటనవేలు కొరికే అవకాశం ఉన్నట్లయితే, పిల్లల బొటనవేలుపై నిమ్మరసం, వేప ఆకు రసం పూయాలి. నిమ్మకాయ పులుపు, వేప చేదు వల్ల పిల్లలకు మళ్లీ వేలు కొరికే ప్రయత్నం చేయరు.
బొటనవేలు క్లాత్‌తో చుట్టాలి: పిల్లల బొటనవేలు చప్పరించే అలవాటును తొలగించడానికి, పిల్లల బొటనవేలు చుట్టూ ఒక గుడ్డను కట్టవచ్చు. లేదంటే మార్కెట్లో లభించే థంబ్ గార్డ్ (ఫింగర్ గార్డ్)ని కూడా ఉపయోగించవచ్చు.
మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..