AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care: విటమిన్ సి సీరమ్ వాడాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారా! అయితే ఈ విషయాలు మీ కోసమే!!

అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. మరీ ముఖ్యంగా మగువలకు అందంపై మమకారం ఎక్కువ. 10 మందీ ఉండే చోట ఎవరికి వారే స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించాలని తమ అందానికి మెరుగులు దిద్దుతారు. అందుకోసం మార్కెట్లో లభించే మేకప్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే.. రసాయనాలతో తయారు చేసే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో వేటిని వాడితే చర్మానికి మంచిది అనేదానిపై తర్జనభర్జన పడుతుంటారు. కుప్పలు తెప్పలుగా వెలిసిన కాస్మోటిక్ సెంటర్లలో చర్మ సంరక్షణకు వాడే వాటిలో..

Skin Care: విటమిన్ సి సీరమ్ వాడాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారా! అయితే ఈ విషయాలు మీ కోసమే!!
Skin Care
Chinni Enni
|

Updated on: Aug 25, 2023 | 9:30 PM

Share

అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. మరీ ముఖ్యంగా మగువలకు అందంపై మమకారం ఎక్కువ. 10 మందీ ఉండే చోట ఎవరికి వారే స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించాలని తమ అందానికి మెరుగులు దిద్దుతారు. అందుకోసం మార్కెట్లో లభించే మేకప్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే.. రసాయనాలతో తయారు చేసే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో వేటిని వాడితే చర్మానికి మంచిది అనేదానిపై తర్జనభర్జన పడుతుంటారు.

కుప్పలు తెప్పలుగా వెలిసిన కాస్మోటిక్ సెంటర్లలో చర్మ సంరక్షణకు వాడే వాటిలో ఏవి మంచివి ? ఏయే ప్రొడక్ట్స్ వాడితే చర్మానికి రక్షణ ఉంటుందన్న దానిపై ఇప్పటికీ చాలామందికి కన్ఫ్యూజనే. విటమిన్ – సి సీరమ్ వాడటం చర్మానికి మంచిదేనా ? వాడితే ఏమైనా హాని కలుగుతుందా ? అన్న అనుమానాలున్నాయి. విటమిన్ -సి సీరమ్ ఎలా పనిచేస్తుంది ? దానిని వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్-సి సీరమ్ వాడటం చర్మానికి మంచిదే. అయితే ఇందులో ది బెస్ట్ సీరమ్ ఏదో చూసి, తెలుసుకుని వాడాలి. ఈ సీరమ్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. డార్క్ స్పాట్స్ ను తొలగించి, కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఫ్రీ రాడికల్స్ ను తొలగించి.. చర్మం యవ్వనంగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

విటమిన్-సి సీరమ్ ప్రొడక్ట్ ను ఎంపిక చేసుకునేటపుడు లిపోసోమల్ కు ప్రాధాన్యతనివ్వాలి. ఇందులోని బయో యాక్టివ్ సమ్మేళనాలు ప్రకాశవంతమైన ఛాయను ప్రోత్సహిస్తాయి. విచ్ హాజెల్, గ్రీన్ టీ, హైలురోనిక్ యాసిడ్ వంటి సమ్మేళనాలతో విటమిన్ సి సీరమ్ ను తయారు చేస్తారు. విచ్ హాజెల్ అనే సమ్మేళనం చర్మాన్ని రక్షిస్తుంది. గ్రీన్ టీ ఉపశమనాన్ని, టోన్ లను అందిస్తుంది. హైలురోనిక్ యాసిడ్ చర్మాన్ని తేమగా ఉండేలా చేస్తుంది.

అలాగే విటమిన్-సి సీరమ్.. చర్మంపై గీతలు, ముడతలను తగ్గించే కొల్లాజెన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. మెలనిన్ ను నిరోధించి చర్మం ఛాయను ప్రకాశవంతం చేస్తుంది. విటమిన్ -సి సీరమ్ ను రోజూ ఉపయోగించడం వల్ల ఎండ, కాలుష్యం వల్ల కలిగే ఫ్రీ రాడికల్ నష్టాలను తగ్గిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us