AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: నిల్వ ఉంచిన ఆహారం తింటే ఏమవుతుంది.. నిపుణులు ఏమంటున్నారంటే..

మిగిలిపోయిన ఆహారం తక్కువ పోషక విలువలను కలిగి ఉంటుంది. నిల్వ ఉంచిన ఆహారాన్ని నిరంతరం తినడం వల్ల శరీరంలో నీరసం వచ్చేస్తుంది. ప్రతిరోజూ మిగిలిపోయిన ఆహారాన్ని తినే వ్యక్తులు క్లినికల్ డిప్రెషన్‌తో బాధపడే ప్రమాదం..

Health Tips: నిల్వ ఉంచిన ఆహారం తింటే ఏమవుతుంది.. నిపుణులు ఏమంటున్నారంటే..
Stored Food (file Photo)
Amarnadh Daneti
|

Updated on: Oct 14, 2022 | 2:07 PM

Share

ఈరోజు వండిన ఆహారం రేపు తినడం చాలా మందికి నచ్చదు. ఇళ్లలో ఉదయం వండిన ఆహారం మిగిలితే, దానిని రాత్రికి ఉంచరు. అవసరమైతే ఆ ఆహారాన్ని పాడేసి, రాత్రికి మళ్లీ ఆహారాన్ని రెడీ చేసుకుంటారు. ఇవ్వన్నీ పాత రోజులు. నేటి ఆధునిక యుగంలో అందరూ బిజీ అయిపోతున్నారు. దీనికి తగినట్లుగా లైఫ్ స్టైల్ లోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. దీంతో వంట చేయడాన్ని గతంలో ఎంతో ప్రేమించేవారు.. నేడు భారంగా భావిస్తున్న సందర్భాలున్నాయి. గతంలో ఊరుకొకటి ఉండే కర్రీ పాయింట్లు.. సాధారణ పట్టణాల్లో వీధికి రెండు మూడు తయారయ్యాయి. కొంతమంది కొన్ని ఆహారపదార్థాలను రెండు, మూడు రోజులకు సరిపడా తయారుచేసుకుని వాటిని నిల్వచేసుకుని.. తినే ముందు వేడిచేసుకుని తింటుంటాం. ఇది ఆరోగ్యానికి అసలు మంచిది కాదంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఆయుర్వేద వైద్య పద్ధతుల ప్రకారం వండిన ఆహారాన్ని 3 గంటలలోపు లేదా గరిష్టంగా అదే రోజున తినాలి.  మనం తయారుచేసుకున్న ఆహారాన్ని గాలి కూడా చేరని డబ్బాల్లో ఎంత నిల్వ ఉంచినా.. మరుసటి రోజుకు అది తాజాగా ఉండదు. కచ్చితంగా పాడైపోతుంది. ఫ్రిజ్​లోపెట్టి నిల్వచేసినా.. ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

మిగిలిపోయిన ఆహారాన్ని మరుసటి రోజు తీసుకుంటే అది మిమ్మల్ని మరింత సోమరులను చేస్తుంది. సాధారణంగా వండిన ఆహారాన్ని వంట చేసిన కొన్ని గంటల్లోనే తినాలని.. మరుసుటిరోజుకు మిగిలి ఉంటే వాటిని అవశేషాలు అంటారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నిల్వ ఉన్న ఆహార పదార్థాలలో ఎటువంటి శక్తి ఉండదని, అందుకే అవి వ్యక్తుల్ని మరింత నీరసంగా, సోమరిపోతులుగా చేస్తాయని చెబుతున్నారు. నిల్వ ఉంచిన ఆహారంలో వ్యాధులతో పోరాడే సామర్థ్యం తక్కువు ఉంటుంది. ఇది మన రోగనిరోధక వ్యవస్థ పనితీరును ప్రభావితం చేస్తుంది. తాజా ఆహారం మానసిక ఉల్లాసం, ప్రశాంతత, శక్తిని అందిస్తే.. నిల్వ ఉంచిన ఆహారం సోమరితనాన్ని పెంచుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

నిల్వ ఉంచిన ఆహారం ఎందుకు తినకూడదు

మిగిలిపోయిన ఆహారం తక్కువ పోషక విలువలను కలిగి ఉంటుంది. నిల్వ ఉంచిన ఆహారాన్ని నిరంతరం తినడం వల్ల శరీరంలో నీరసం వచ్చేస్తుంది. ప్రతిరోజూ మిగిలిపోయిన ఆహారాన్ని తినే వ్యక్తులు క్లినికల్ డిప్రెషన్‌తో బాధపడే ప్రమాదం ఎక్కువగా ఉందంటున్నారు నిపుణులు. ఫ్రిడ్జ్‌లు లేనప్పుడు ఇలాంటివి సమస్యలు ఉండేవి కాదు. ఎప్పుడు వండేవి అప్పుడే తినేవారు. లేదా కొన్ని గంటల్లో తినేవారు. ఒకవేళ అన్నం తిన్నా.. దానిని గంజితోనో.. లేదా మజ్జిగతో తీసుకునేవారు అందుకే పాతకాలం మనుషులు ఎంతో ధృఢంగా ఉండేవారు. నేటి ఆధునిక కాలంలో ఒక కూరను రెండు రోజులకు వండేసుకోవడం. లేదా రేపు వంట చేసే శ్రమ తగ్గుతుందని ఈ రోజే ఎక్కువ వండేసి ఫ్రిజ్​లో పెట్టడం చాలామంది చేస్తున్నారు. పైగా వాటిని ఫ్రిజ్​ నుంచి తీసి మళ్లీ వేడి చేసి తింటున్నారు. అందుకే ఇది పెరుగుతున్న వ్యాధులకు కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇలా మిగిలిన ఆహారాన్ని తినకుండా ఉండేదుంకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కావాల్సినంత ఆహారాన్నే తయారుచేసుకోవాలి

ఈరోజు వండిన భోజనాన్ని మరుసటి రోజు నిల్వ ఉంచకుండా వండిన రోజునే తినడానికి ప్రయత్నించాలి. అప్పటికీ ఆహారం మిగిలి ఉంటే.. అదే రోజు ఆహారం అవసరమైన వారికి ఇవ్వడం ద్వారా ఆహారం నిల్వలేకుండా చూసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు