AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూరిక్ యాసిడ్​ ఎక్కువై ఇబ్బంది పడుతున్నారా..? తినే ఆహారం విషయంలో ఈ పొరపాట్లు చేయకండి..!

శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయులు పెరగడం అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, వాపులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి 7.0 mg/dl కంటే ఎక్కువ అయితే అది కీళ్లలో స్పటికాలుగా పేరుకుపోతుంది. దీనివల్ల కీళ్లలో నొప్పి, వాపు వంటి సమస్యలు తలెత్తుతాయి.

యూరిక్ యాసిడ్​ ఎక్కువై ఇబ్బంది పడుతున్నారా..?  తినే ఆహారం విషయంలో ఈ పొరపాట్లు చేయకండి..!
Simple Diet To Reduce Uric Acid
Prashanthi V
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 01, 2025 | 9:00 PM

Share

ఇప్పటి జీవన విధానం, ఆహారపు అలవాట్ల వల్ల అనేక మందిని ఈ సమస్య వేధిస్తోంది. శరీరం ప్యూరిన్స్ అనే రసాయనాలను విచ్ఛిన్నం చేసినప్పుడు యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. అయితే రోజూ సరైన సమతుల్యం లేని ఆహారం తీసుకోవడం, ప్రాసెస్‌డ్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతోంది. దీనిని నియంత్రించాలంటే కొన్ని తెల్లటి ఆహార పదార్థాలను పూర్తిగా మానేయడం మంచిది.

యూరిక్ యాసిడ్ అధికం అయ్యే లక్షణాలు

  • కీళ్లలో తీవ్రమైన నొప్పి, వాపు
  • చర్మం రంగు మారడం, వేడిగా అనిపించడం
  • తరచూ మూత్ర విసర్జన చేయడం
  • అరికాళ్ల ప్రాంతంలో వాపు, ఎర్రగా మారడం
  • ముఖ్యంగా బొటన వేలి దగ్గర ఎక్కువ నొప్పి

క్యాబేజీ, కాలీఫ్లవర్

NHI నివేదిక ప్రకారం క్యాబేజీ, కాలీఫ్లవర్‌లో ప్యూరిన్ అధికంగా ఉండటంతో యూరిక్ యాసిడ్ ఎక్కువగా తయారవుతుంది. కాబట్టి ఈ కూరగాయలను తక్కువగా తీసుకోవడం ఉత్తమం.

పుట్టగొడుగులు (మష్రూమ్స్)

ఇటీవల మష్రూమ్స్‌ వాడకం బాగా పెరిగింది. అయితే ఇవి సాధారణంగా ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే వారి కోసం ఇవి మంచివి కావు. ఎందుకంటే పుట్టగొడుగుల్లో ప్యూరిన్ స్థాయులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తగ్గించినప్పుడే సమస్య నియంత్రణలో ఉంటుంది.

వైట్ బ్రెడ్

వైట్ బ్రెడ్ పూర్తిగా ప్రాసెస్‌డ్ ఫుడ్‌. ఇందులో పీచు పదార్థం లేకపోవడంతో జీర్ణక్రియ మీద చెడు ప్రభావం చూపుతుంది. దీన్ని అధికంగా తినడం వల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వస్తాయి. పైగా శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం, కీళ్ల నొప్పులు రావడం వంటి సమస్యలు మరింతగా పెరుగుతాయి.

వైట్ షుగర్, స్వీట్స్

చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే స్వీట్స్, సాఫ్ట్ డ్రింక్స్ లాంటి వాటిలో చక్కెర అధికంగా ఉండటంతో ఇవి ఆరోగ్యానికి హానికరం.

ఉప్పు అధికంగా తినడం

శరీరంలో సోడియం ఎక్కువ అయితే అది నీటిని నిల్వ చేయడం వల్ల వాపు సమస్యలు పెరుగుతాయి. ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల మూత్ర విసర్జన ఎక్కువగా అవుతుంది. దీని వల్ల యూరిక్ యాసిడ్ ప్రభావం కూడా ఎక్కువవుతుంది. కాబట్టి వంటలో ఉప్పును పరిమితంగా వాడాలి.

సమస్యను నియంత్రించడానికి ఉపయోగకరమైన చిట్కాలు

  • ఎక్కువగా నీళ్లు తాగండి.. శరీరంలోని వృధా పదార్థాలను బయటకు పంపుతుంది.
  • శాకాహారాన్ని ఎక్కువగా తీసుకోండి.. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం మంచిది.
  • ప్రాసెస్‌డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ దూరంగా ఉండండి.
  • మితమైన వ్యాయామం చేయడం ద్వారా శరీరంలోని యూరిక్ యాసిడ్ స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)