childrens Memory: పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగడం లేదని ఆందోళనలో ఉన్నారా.. ఈచిట్కాలతో చిట్టిబుర్రలకు పదును పెట్టండి..
కొంతమంది పిల్లలు చాలా షార్ప్ గా ఉంటారు. ఎదైనా ఘటన జరిగితే వెంటనే గుర్తించుకుని కొద్ది రోజుల తర్వాత కూడా వాటిని చెప్తూ ఉంటారు. లేదా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ప్రస్తావిస్తూ ఉంటారు. అలాంటప్పుడు పిల్లల..
childrens Memory: కొంతమంది పిల్లలు చాలా షార్ప్ గా ఉంటారు. ఎదైనా ఘటన జరిగితే వెంటనే గుర్తించుకుని కొద్ది రోజుల తర్వాత కూడా వాటిని చెప్తూ ఉంటారు. లేదా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ప్రస్తావిస్తూ ఉంటారు. అలాంటప్పుడు పిల్లల తెలివితేటలు, జ్ఞాపకశక్తిని తెగ పొగిడేస్తాం. ఒక్కోసారి కొంతమంది పిల్లలు ఏ విషయాన్ని అసలు గుర్తించుకోరు. పిల్లాడి జ్ఞాపకశక్తి పెరగడంలేదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. వాడి తోటి పిల్లలు షార్ప్ గా ఉంటే.. తమ పిల్లాడు డల్ గా ఉన్నాడంటూ బెంగపెట్టుకుంటారు. జ్ఞాపకశక్తిని పెంచడానికి ఆయుర్వేద ఔషధాలు వాడుతూ ఉంటారు. కాని పిల్లల జ్ఞాపకశక్తికి పదునుపెట్టే బాధ్యత తల్లిదండ్రులదే. అలా చిట్టిబుర్రలకు పదును పెట్టాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..
పిల్లలకు ఎలాంటి సమస్యలు లేకపోయినా ఈ చిట్కాలను ప్రయత్నించడం వల్ల వారి జ్ఞాపకశక్తికి పదును పెట్టవచ్చు. పిల్లల అభ్యాసం, అభిజ్ఞా నైపుణ్యాలు పెంచడంలో జ్ఞాపకశక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్న పిల్లవాడు పాఠశాలలో వివిధ సమస్యలను ఎదుర్కోవచ్చు. కాబట్టి పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి కొన్ని ఏం చేయాలో తెలుసుకుందాం.
ఆటలు : పిల్లల జ్ఞాపకశక్తి , నాలెడ్జ్ ను పెంచడానికి ఆహ్లాదకరమైన మెదడుకు సంబంధించిన ఆటలు చాలా అవసరం. ఇవి ఎక్కడైనా ఆడగలిగేలా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ఆడుకునే చిన్ని చిన్న ఆటలు పిల్లల జ్ఞాపకశక్తికి పదునుపెట్టడానికి దోహదపడతాయి.
ఒత్తిడి: ప్రతి బిడ్డకు ప్రత్యేకమైన అభ్యాస శైలి ఉంటుంది. మీరు పిల్లల పాఠాలను అర్థం చేసుకోవడానికి అవసరమైన సమయాన్ని వారికి కేటాయించాలి. కొత్తది నేర్చుకునేటప్పుడు వారు ఎలాంటి ఒత్తిడి లేదా న్యూనతా భావాలను అనుభవించకూడదు. కాబట్టి పిల్లల ఉత్సుకతను ప్రోత్సహించాలి. కొత్త విషయాలను నేర్చుకోవడంలో వారిని ఉత్సాహపర్చాలి. వారికి ఇష్టమైన సబ్జెక్టును వారు ఎప్పటికీ మరచిపోకుండా ఉండటానికి ఈ వైఖరి దోహదపడుతుంది.
నిద్ర : పిల్లలు వారి జ్ఞాపకశక్తిని బలోపేతం చేయడానికి ,మెరుగుపరచడానికి ప్రతిరోజూ 8 నుంచి 10 గంటల పాటు నిద్రపోవాలి. పిల్లల నిద్ర కోసం షెడ్యూల్ రూపొందించుకోవడం బెటర్. వారు సమయానికి నిద్రపోయేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం ద్వారా మరుసటి రోజు స్కూలుకు వెళ్లడానికి ముందు పిల్లలు తగినంత విశ్రాంతి పొందుతారు.
గ్రీన్ వెజిటేబుల్స్: గ్రీన్ వెజిటేబుల్స్ లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, బి, సి, డి ,కె ఉంటాయి. ఇవి పిల్లల మెదడు అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పాలకూర, కొత్తిమీర , పుదీనా ఆకులు, ఆవాలు, బచ్చలికూర, బీట్‌రూట్ వంటివి పిల్లలకు పెట్టేందుకు మంచి కూరగాయలు. మీ పిల్లలు తినే ఆహారంలో ఈపదార్థాలు ఉండేలా చూసుకోవాలి.
నట్స్: పిల్లలు రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే పౌష్టికాహారం చాలా అవసరం. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉండే బాదం, వేరుశెనగ, పిస్తా, జీడిపప్పు వంటి గింజలను పిల్లల ఆహారంలో జోడించాలి. గుమ్మడి గింజలు, చియా గింజలు, నువ్వులు, పొద్దుతిరుగుడు విత్తనాలు , అవిసె గింజలు వంటి విత్తనాలు పిల్లల అభిజ్ఞా సామర్థ్యాలను మెరుగుపరుస్తాయి. వీటిని నేరుగా తినవచ్చు లేదా కేక్‌లు, మిల్క్‌షేక్‌లు, ఖీర్ మొదలైన వాటికి జోడించవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..