ఈ రోజుల్లో మైగ్రేన్ అనేది సర్వసాధారణమైన సమస్యగా మారిపోయింది. కొన్నిసార్లు ఈ తలనొప్పి భరించలేనిదిగా మారుతుంది. కొందరిలో వాంతులు, వికారం లాంటివి కూడా తలెల్తుతాయి. మానసిక ఒత్తిడి, అలసట, మలబద్ధకం, అధిక మద్యపానం, రక్తహీనత, జలుబు, దగ్గు వాటివల్ల మైగ్రేన్ సమస్యలు వేధిస్తాయి. దీనిని ప్రాథమిక దశలో గుర్తిస్తే సులభంగా నయం చేయవచ్చు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం మరింత అనారోగ్యానికి గురవక తప్పదు. మైగ్రేన్ నివారణకు సరైన మందులు తీసుకుంటూనే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది పడితే అది అసలు తినకూడదంటున్నారు నిపుణులు. అదే సమయంలో పోషకాహారం బాగా తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి మైగ్రేన్ బాధితులు ఏం తినాలో, వేటికి దూరంగా ఉండాలో తెలుసుకుందాం రండి. మైగ్రేన్ బాధితులకు అరటిపండు చాలా మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. అలాగే ఇందులో పొటాషియం, మెగ్నీషియం తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. అదే సమయంలో, మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెరను నియంత్రించవచ్చు. అలాగే మెగ్నీషియం మైగ్రేన్ బాధితులకు కూడా ఎంతో మేలు చేస్తుంది.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, సీఫుడ్ తీసుకోవడం వల్ల మైగ్రేన్ రిస్క్ తగ్గుతుంది. చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ మైగ్రేన్ బాధితులకు చాలా మేలు చేకూరుస్తుంది. మైగ్రేన్ బాధితులు వారానికి కనీసం రెండుసార్లు సీఫుడ్ తినాలి. అదనంగా ఆకుపచ్చ కూరగాయలు, విటమిన్-సి లేని పండ్లు తీసుకోవచ్చు.
సాధారణంగా టీ , కాఫీ తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుందని చెబుతారు.అయితే మైగ్రేన్ బాధితులు టీ, కాఫీలు తాగకూడదు. వీటిలో కెఫిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మైగ్రేన్ సమస్యను పెంచుతుంది.
మద్యం అసలు సేవించవద్దు. ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఆల్కహాల్ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మైగ్రేన్ బాధితులు అసలు మద్యం సేవించకూడదు. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.
డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. విధ వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే మైగ్రేన్ బాధితులు డార్క్ చాక్లెట్‌ను తీసుకోకూడదు. దీని ఉపయోగం మైగ్రేన్ ప్రమాదాన్ని పెంచుతుంది. డార్క్ చాక్లెట్ తినడం వల్ల మైగ్రేన్ వచ్చే ప్రమాదం ఉందని ఒక అధ్యయనంలో తేలింది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి