నిద్ర అనేది ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యం. సరైన నిద్ర ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు పదేపదే చెబుతుంటారు. అయితే ఆరోగ్యం కోసం ప్రతి రోజు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. కానీ రాత్రుల్లో చాలా మంది దాహంతో నిద్రలేవడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో నిద్రకు ఆటంకం కలుగుతుంది. మరి రాత్రుల్లో చాలా మందికి చెమటలు పట్టి మీ గొంతు ఎండిపోతుంది. ఈరోజుల్లో ఈ సమస్య సర్వసాధారణమైపోయింది. ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండటం చాలా మంది. మరి రాత్రుల్లో దాహం వేయకుండా ఉండాలంటే ఏం చేయాలి..? దాహం వేయడానికి ఎలాంటి కారణాలున్నాయో తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన పెద్దలకు రోజుకు 8 నుంచి 10 గ్రాసుల నీరు అవసరమని వైద్యులు చెబుతున్నారు. మీరు పగటిపూట తక్కువ నీటిని తీసుకుంటే, రాత్రి సమయంలో శరీరం నీటి కొరత ఉందని తెలియజేస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. అందుకే నిర్ణీత వ్యవధిలో గొంతును తేమగా ఉంచుకోండి. రోజుకు శరీరానికి కావాల్సిన నీటిని తాగడం మేలంటున్నారు.
భారతదేశంలో టీ, కాఫీలను ఇష్టపడేవారికి కొరత లేదు. అయితే ఇది ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. ఈ పానీయాలలో కెఫిన్ మొత్తం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది రాత్రి సమయంలో కలవరపెడుతుంది. కెఫిన్ కారణంగా మూత్రం మళ్లీ మళ్లీ వస్తుంది. ఇది శరీరంలోని నీటిని తగ్గిస్తుంది. ఉప్పగా ఉండే పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. రోజంతా 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలి. మీరు ఇంతకు మించి తీసుకుంటే అది ఖచ్చితంగా శరీరంపై చెడు ప్రభావం చూపుతుంది. ఉప్పులో సోడియం ఉంటుంది. ఇది నిర్జలీకరణానికి కారణమవుతుంది. అందుకే తరచుగా రాత్రి సమయంలో దాహం ఎక్కువగా వేస్తుంటుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి