Vitamins Deficiency: మీరు తరచూ ఒళ్లు నొప్పులు, అలసటతో బాధపడుతున్నారా? అయితే మీకు ఆ విటమిన్ల లోపం ఉన్నట్లే..!
హర్మోన్ల అసమతుల్యత, పెలుసైన గోళ్లు, కండరాల బలహీనత, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలు కూడా వేధిస్తే కచ్చితంగా అప్రమత్తం కావాలని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ సమస్యలన్నీ విటమిన్లు, డి 3, బీ 12 లోపంతోనే సంభవిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఈ రెండు విటమిన్ల లోపం శరీరాన్ని చాలా మార్పులకు గురి చేస్తుంది.

ప్రస్తుతం శీతాకాలంలో అందరూ వళ్లు నొప్పులతో బాధపడడం సహజం. అలాగే కొంత సమయానికే అలసిపోవడం వంటి లక్షణాలు మనల్ని తరచూ వేధిస్తాయి. అయితే ఇలాంటి లక్షణాలుంటే మాత్రం మరింత జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ల లోపం వల్లే ఇవి జరుగుతాయని చెబుతున్నారు. అలాగే హర్మోన్ల అసమతుల్యత, పెలుసైన గోళ్లు, కండరాల బలహీనత, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలు కూడా వేధిస్తే కచ్చితంగా అప్రమత్తం కావాలని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ సమస్యలన్నీ విటమిన్లు, డి 3, బీ 12 లోపంతోనే సంభవిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఈ రెండు విటమిన్ల లోపం శరీరాన్ని చాలా మార్పులకు గురి చేస్తుంది. మెదడు దగ్గర నుంచి ఎముకల వరకూ ప్రతి అవయువం కూడా ఇబ్బందిపెడతాయి. కాబట్టి కచ్చితంగా విటమిన్లు మన శరీరంలో తగిన స్థాయిల్లో ఉన్నాయా? లేదా? అని తరచూ పరీక్షించుకోవాలి. ఈ విటమిన్లు శరీరంలోని జన్యువుల పనితీరును నియంత్రిస్తాయి. అందువల్ల వీటి లోపం మొత్తం శరీరంపై ప్రభావం చూపిస్తుంది.
విటమిన్లు డి 3, బీ 12 ఉపయోగాలు
విటమిన్ డి3 ఎముకల బలమైనవిగా చేయడంలో సాయం చేస్తుంది. అలాగే వైట్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్, సెక్స్ హార్మన్లను రిలీజ్ చేయడంలో సహకరిస్తుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ డి3 బాగా పని చేస్తుంది. అలాగే బీ 12 శరీరానికి శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన పేగులు, అలాగే రెడ్ బ్లడ్ సెల్స్ ను ఉత్పత్తి చేయడం, నరాల ఆరోగ్యంలో కూడా బీ 12 సాయం చేస్తుంది.
విటమిన్ల లోపం ఎందుకు?
ముఖ్యంగా విటమిన్లు డి 3, బీ12 లోపం సరైన జీవన శైలి లేకపోవడం వల్ల వస్తుంది. శరీరానికి సూర్యరశ్మి తగలకపోతే విటమిన్ డి3 లోపం వస్తుంది. బీ 12 లోపం మాత్రం మద్యపానం, ధూమపానం వల్ల వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే శాకాహారుల్లో అధిక శాతం మంది విటమిన్ బీ 12 లోపం వస్తుందని పేర్కొంటున్నారు. అయితే ఈ లోపాలు ఉన్నాయో? లేదో? తెలుసుకోడానికి హోమోసెస్టీన్ స్థాయిలను తనిఖీ చేయాలి.
విటమిన్ లోపాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు
విటమిన్లు డి3, బీ 12 లోపంతో బాధపడితే కచ్చితంగా సప్లిమెంట్లు వాడాలి. అలాగే జీవన శైలిలో చిన్నపాటి మార్పులను కూడా చేసుకోవాలి. విటమిన్ డి3 పెంచేందుకు డైలీ ఎండలో నడవడం, అలాగే గుడ్లు, పుట్టగొడుగులు, చేపలు వంటి వాటిని ఎక్కువగా తినాలి. అలాగే బి 12 ను పెంచేందుకు పులియబెట్టిన ఆహారం, మాంసం, పాల ఉత్పత్తులను తరచూగా తినాలి.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



