Heart Health: గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సూపర్ టిప్స్.. ఈ మార్పులతో చెడు కొలెస్ట్రాల్ దూరం
ముఖ్యంగా ఎల్ డీఎల్ స్థాయి విపరీతంగా పెరగడంతో గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. గుండె ఆరోగ్య రక్షణకు వివిధ చర్యలు తీసుకున్నా ఎల్ డీఎల్ స్థాయిలో మాత్రం ఎలాంటి మార్పులు కనిపించడం లేదని కొందరు బాధపడిపోతుంటారు. అయితే జీవన శైలిలో చిన్నపాటి మార్పులతో ఎల్ డీఎల్ స్థాయిలను తగ్గించుకోవచ్చని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.

శరీరంలోని అవయువాల్లో చాలా గుండె చాలా ముఖ్యమైందని అందరికీ తెలిసిందే. కానీ మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల కారణంగా అందరినీ చెడు కొలెస్ట్రాల్ సమస్య వేధిస్తుంది. అయితే ఇది ముఖ్యంగా గుండెపై ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఎల్ డీఎల్ స్థాయి విపరీతంగా పెరగడంతో గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. గుండె ఆరోగ్య రక్షణకు వివిధ చర్యలు తీసుకున్నా ఎల్ డీఎల్ స్థాయిలో మాత్రం ఎలాంటి మార్పులు కనిపించడం లేదని కొందరు బాధపడిపోతుంటారు. అయితే జీవన శైలిలో చిన్నపాటి మార్పులతో ఎల్ డీఎల్ స్థాయిలను తగ్గించుకోవచ్చని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే ఎలాంటి మార్పులను పాటించాలో కూడా సవివరంగా పేర్కొంటున్నారు. పోషకాహార నిపుణులు చెప్పే ఆ మార్పులను ఓ సారి తెలుసుకుందాం.
కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే సూపర్ టిప్స్ ఇవే..
మంచి ఆహారం
గుండెకు మేలు చేసే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. మనం రెగ్యులర్ తీసుకునే ఆహారంలో ట్రాన్స్ ఫ్యాట్ లను తొలగించాలి. ఒమెగా-3, ఆరోగ్యకరమైన ఆమ్లాలు ఆహారంలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఆవు నెయ్యి, సాల్మన్ ఫిష్, వాల్ నట్స్, అవిసె గింజలను ఎక్కువగా తింటే శరీరంలోని కొవ్వు స్థాయిలను నియంత్రించవచ్చు. అలాగే ప్యాకెజ్ట్ ఫుడ్స్ కు కూడా దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
వ్యాయామం
నిపుణులు సూచనల ప్రకారం డైలీ వ్యాయామం చేయడం తప్పనిసరి. ఎందుకంటే శారీరక అలసట చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. కాబట్టి కచ్చితంగా డైలీ వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.



ధూమపానానికి దూరం
ధూమపానానికి దూరంగా ఉంటే శరీరంలో ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతాయి. అలాగే హెచ్ డీఎల్ స్థాయి పెరుగుతుంది. ఇది వారి ధమనులను రక్షించడంలో కూడా సాయం చేస్తుంది.
శరీర బరువు
అధిక బరువు, ఊబకాయం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. కాబట్టి కచ్చితంగా బరువును కంట్రోల్ లో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న బరువు నుంచి 5 నుంచి 10 శాతం కచ్చితంగా బరువు తగ్గాలి. ఇలా చేస్తే శరీరంలో ఉండే హెల్దీ ఫ్యాట్స్ పెరుగుతాయి.
మితమైన మద్యపానం
మద్యపానం అలవాటు ఉన్న వారు దానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఒకేసారి మానేయలేకపోతే క్రమంగా ఆ అలవాటు నుంచి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అధిక ఆల్కహాల్ ఆరోగ్యానికి హాని చేస్తుంది. కాబట్టి కచ్చితంగా మద్యపానం విషయంలో ముఖ్యంగా పెద్ద వయస్సున్న వారు జాగ్రత్త వహించాలి.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..
