AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eggs in Summer: వేసవిలో గుడ్లు ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

వేసవిలో గుడ్లు తినడం వల్ల శక్తి వస్తుంది కానీ.. కొన్ని సార్లు ఇబ్బందులు కూడా కలగొచ్చు. ఎక్కువగా తింటే ఒంట్లో వేడి పెరిగి అజీర్ణం, నీరసం వంటి సమస్యలు వస్తాయి. అందుకే వేసవిలో గుడ్లను తక్కువగా తీసుకోవడం మంచిది అంటున్నారు వైద్య నిపుణులు.

Eggs in Summer: వేసవిలో గుడ్లు ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
Eggs
Prashanthi V
|

Updated on: May 10, 2025 | 2:42 PM

Share

గుడ్లు ఆరోగ్యానికి మంచి ఆహారం. ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ ఉన్న గుడ్లు శక్తిని ఇస్తాయి. అయినా వేసవిలో ఎక్కువగా గుడ్లు తినడం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. వేసవి కాలంలో శరీర ఉష్ణోగ్రత సహజంగానే ఎక్కువగా ఉంటుంది. గుడ్ల మోతాదూ ఎక్కువ అయితే కడుపులో వేడి పెరుగుతుంది. దీనివల్ల కొందరికి అజీర్ణం, ఆమ్లత వంటి సమస్యలు రావచ్చు. ఇది శరీరాన్ని అలసటగా మారుస్తుంది. వేసవిలో గుడ్లు తినేటప్పుడు తక్కువ మోతాదులో తీసుకోవాలి.

గుడ్లు మానవ శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందిస్తాయి. కానీ వేసవిలో ఎక్కువగా తింటే జీర్ణవ్యవస్థపై ఒత్తిడి వస్తుంది. మలబద్ధకం, కడుపు నొప్పి, గ్యాస్ వంటి సమస్యలు మొదలవుతాయి. ఇవి రోజువారీ జీవనశైలిపై ప్రభావం చూపుతాయి. అందుకే గుడ్లు తినేటప్పుడు తగినంత నీరు తాగాలి. అవసరమైతే మజ్జిగ కూడా తీసుకోవాలి. ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది.

గుడ్లలో ఉండే ప్రోటీన్ మోతాదు వేసవిలో శరీరానికి భారం అవుతుంది. ముఖ్యంగా మూత్రపిండాలు ఈ ప్రోటీన్‌ను ఫిల్టర్ చేయడంలో ఎక్కువ శ్రమపడతాయి. ఇది మూత్రపిండాల పనితీరును దెబ్బతీయొచ్చు. కిడ్నీ సమస్యలున్న వారు గుడ్లు తినే ముందు తప్పకుండా వైద్య సలహా తీసుకోవాలి.

గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. వేసవిలో శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నపుడు కొలెస్ట్రాల్ స్థాయులు నియంత్రణలో లేకపోతే గుండె సమస్యలు వచ్చే అవకాశముంది. గుండె జబ్బులున్నవారు గుడ్ల వినియోగాన్ని పరిమితంగా ఉంచాలి. అప్పుడే ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

కొంతమందికి గుడ్లు తింటే శరీర ప్రతిచర్యగా అలెర్జీలు వస్తాయి. ఇది చర్మంపై దద్దుర్లు, కన్నీళ్లు, వాంతులు, కడుపు నొప్పి వంటి లక్షణాలుగా కనిపించొచ్చు. అలాంటి పరిస్థితుల్లో గుడ్లను పూర్తిగా మానేయాలి. వెంటనే వైద్యుని సంప్రదించడం అవసరం.

వేసవిలో రోజుకు రెండు గుడ్లకంటే ఎక్కువ తినకూడదు. శరీర పరిస్థితిని బట్టి కొంతమంది ఒక్కటి మాత్రమే తినాలి. పిల్లలు, వృద్ధులు లేదా జీర్ణ సమస్యలున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి తగినంత నీరు అందించడం, ఉష్ణోగ్రతను అదుపులో పెట్టుకోవడం ద్వారా గుడ్ల వల్ల కలిగే ప్రతికూలతలు తగ్గించవచ్చు.

గుడ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే వేసవిలో వాటి వినియోగంపై దృష్టి పెట్టాలి. శరీర పరిస్థితి, ఆరోగ్య పరిస్థితులను బట్టి మోతాదు నిర్ణయించాలి. తగిన పరిమితిలో గుడ్లు తింటే శక్తిని అందిస్తాయి. కానీ అధికంగా తింటే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికైనా సందేహం ఉంటే నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.