AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవిలో రోజుకోసారి ఈ జ్యూస్‌ తప్పక తీసుకోండి.. అందం, ఆరోగ్యానికి అన్ని లాభాలే..!

ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలలో యాపిల్ అతి ప్రధానమైనదిగా చెబుతారు. దీనిలో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు నిండి వున్నాయి. అందుకే రోజుకో యాపిల్‌ తింటే డాక్టర్‌తో పనే ఉండదని పెద్దలు తరచూ చెబుతుంటారు. ప్రతి రోజూ ఒక యాపిల్‌ తినటం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అలాంటి యాపిల్‌ పండుగా మాత్రమే కాదు.. యాపిల్‌ జ్యూస్‌గా తీసుకుంటే ఏమౌతుందో ఇక్కడ తెలుసుకుందాం...

Jyothi Gadda
|

Updated on: May 10, 2025 | 2:14 PM

Share
యాపిల్‌ పండును ఇష్టపడని పిల్లలు యాపిల్‌ జ్యూస్‌ను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. దీని మీరు బ్రేక్‌ ఫాస్ట్‌లో భాగంగా తీసుకోవడం చాలా అవసరం అంటున్నారు నిపుణులు. యాపిల్‌ జ్యూస్‌ కోసం కావలసినవి 4 పెద్ద యాపిల్స్ తొక్క తీసి, కోర్ తీసేసి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తరువాత ఒక జ్యూసర్‌లో ఆపిల్ ముక్కలు, నీరు, నిమ్మరసం, తేనె వేసి బాగా జ్యూస్ చేయండి. ఇప్పుడు ఈ జ్యూస్ ను ఒక గ్లాసులో పోసి కూల్‌గా లేదా అలాగే తీసుకోవచ్చు.

1 / 5
ఇంట్లో తయారు చేసుకున్న యాపిల్‌ జ్యూస్‌ మీకు మరింత తియ్యగా కావాలంటే మరికాస్త తేనెను ఎక్కువగా కలుపుకోవచ్చు. అలాగే, జ్యూస్‌లో మరింత రుచిని పొందాలనుకుంటే, మీరు కొద్దిగా దాల్చినచెక్క పొడి లేదా యాలకుల పొడిని కూడా కలుపుకోవచ్చు.  మీకు చల్లని జ్యూస్ కావాలంటే, మీరు జ్యూస్ చేసిన తర్వాత దానిని రిఫ్రిజిరేటర్‌లో కొన్ని గంటలు ఉంచవచ్చు.

2 / 5
ఇక యాపిల్ జ్యూస్ ప్రయోజనాల విషయానికి వస్తే..యాపిల్‌ జ్యూస్‌ అనేది విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా లభిస్తాయి. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. యాపిల్ జ్యూస్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటంలో సహాయపడుతుంది.

3 / 5
యాపిల్ జ్యూస్‌లో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రించడంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. యాపిల్ జ్యూస్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

4 / 5
యాపిల్ జ్యూస్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి, ఇది క్యాన్సర్‌కు కారణమవుతుంది.
యాపిల్ జ్యూస్‌లో కాల్షియం అధికంగా ఉంటుంది, ఇది ఎముకలను బలోపేతం చేయడానికి ఆస్టియోపొరోసిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

యాపిల్ జ్యూస్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి, ఇది క్యాన్సర్‌కు కారణమవుతుంది. యాపిల్ జ్యూస్‌లో కాల్షియం అధికంగా ఉంటుంది, ఇది ఎముకలను బలోపేతం చేయడానికి ఆస్టియోపొరోసిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

5 / 5