Health: బరువు తగ్గించి, ఆయుష్షును పెంచే అద్భుత డ్రై ఫ్రూట్‌.. పోషకాలకు కేరాఫ్ అడ్రస్..మధుమేహ రోగులకు వరం

వాల్‌నట్స్ తరుచూ తీసుకోవడంతో మంచి ఆరోగ్యంతో పాటు, ఆయుష్షు కూడా పెరుగుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా వాల్‌నట్స్ తీసుకునే వృద్ధులలో కూడా..

Health: బరువు తగ్గించి, ఆయుష్షును పెంచే అద్భుత డ్రై ఫ్రూట్‌.. పోషకాలకు కేరాఫ్ అడ్రస్..మధుమేహ రోగులకు వరం
Walnuts
Follow us

|

Updated on: Jul 06, 2022 | 10:54 AM

Health Benefits of Walnuts:  బరువు తగ్గాలి అనుకునేవారికి చాలామంది చాలా చిట్కాలు చెబుతూ ఉంటారు. బరువు తగ్గడానికి ఈ పని చేయండి ఆ పని చేయండి అంటారు..బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా వాల్‌నట్స్ తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వాల్‌నట్స్‌తో సులభంగా బరువును నియంత్రించుకోవచ్చని సూచిస్తున్నారు. అంతేకాదు, వాల్‌నట్స్ తరుచూ తీసుకోవడంతో మంచి ఆరోగ్యంతో పాటు, ఆయుష్షు కూడా పెరుగుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా వాల్‌నట్స్ తీసుకునే వృద్ధులలో కూడా ఆయుష్షు పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

బరువు తగించుకోవాలని భావించే వారు తప్పనిసరిగా క్రమం తప్పకుండా వాల్‌నట్స్‌ను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే గుణాలు శరీరంలో ALA అనే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా శరీరంలో కొవ్వు కదలికను తగ్గించి.. బరువును నియంత్రించేందుకు సహాయపడుతుంది.

వాల్‌నట్స్‌లో ప్రొటీన్లు, మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పొట్ట ఎక్కువ సమయం పాటు నిండుగా ఉంటుంది. అంతేకాకుండా ఆకలిని నియంత్రించేందుకు కృషి చేస్తుంది. వీటిలో ఉండే మూలకాలు శరీరంలో బరువును నియంత్రించేందుకు ప్రభావవంతంగా పని చేస్తాయి. వీటిల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు- వాల్‌నట్‌లో ఇతర గింజల కంటే ఎక్కువ ఒమేగా -3 ఉంటుంది. ఇది గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే మెదడు పనితీరును పెంచడంలోనూ సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

సాయంత్రం ఆకలిని తీర్చడానికి కుకీలు ఉప్పులకు బదులుగా, కొన్ని వాల్‌నట్స్‌లను తీసుకోవటం మంచిది. దీనిని అల్పాహారంలోనూ తీసుకోవచ్చు. రాత్రిపూట 4 లేదా 5 వాల్‌నట్‌లను నీళ్లలో నానబెట్టుకుని, ఒక కప్పు పెరుగుతో కలిపి ఉదయాన్నే తింటే మేలు చేస్తుంది. ఇంకా కావాలంటే ఈ మిశ్రమానికి ఓట్స్ కూడా జోడించవచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల దానిలో పోషకాల పరిమాణం మరింత పెరుగుతుంది.

మీ రక్తంలో చక్కెర, మధుమేహాన్ని నివారించాలనుకుంటే, నానబెట్టిన వాల్ నట్స్ ను తినడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. రోజూ 2 నుండి 3 వాల్ నట్స్ ను తినేవారిలో టైప్ -2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. వాల్ నట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు,వాల్ నట్స్ ను అధిక మొత్తంలో తీసుకున్న వారు శారీరకంగా కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు