AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎవర్‌గ్రీన్‌ హోటల్‌లో దారుణం.. రోటీలు తయారు చేస్తూ ఉమ్మివేసిన దరిద్రుడు.. వీళ్లు మారరా..?

జలాలాబాద్ చౌక్‌లో ఎవర్‌గ్రీన్ పేరుతో ఓ హోటల్ ఉందని చెబుతున్నారు. హోటల్‌లో నాన్ వెజ్ ఫుడ్ ఫేమస్.. దాంతో కస్టమర్లు భారీగా ఇక్కడికి వస్తుంటారు. ఈక్రమంలోనే హోటల్ కి వచ్చిన ఓ వ్యక్తి రోటీ తయారు చేస్తున్న వ్యక్తిని చూసి షాక్‌ అయ్యాడు.

ఎవర్‌గ్రీన్‌ హోటల్‌లో దారుణం.. రోటీలు తయారు చేస్తూ ఉమ్మివేసిన దరిద్రుడు.. వీళ్లు మారరా..?
Man Spits
Jyothi Gadda
|

Updated on: Jul 06, 2022 | 8:35 AM

Share

ఉత్తరప్రదేశ్‌లో రోటీపై ఉమ్మి వేసిన మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది . ఈసారి బిజ్నోర్‌లోని ఓ హోటల్‌లో అర్బాజ్ అనే యువకుడు రోటీలు తయారు చేస్తూ వాటిపై ఉమ్మివేస్తూ పట్టుబడ్డాడు . ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ తర్వాత స్థానిక పోలీసులు నిందితుడు హోటల్ ఆర్టిజన్ అర్బాజ్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటన నజీబాబాద్‌లోని జలాలాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది.. నిందితుడు అర్బాజ్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇంతకుముందు, రాజధాని లక్నో, మీరట్ నుండి కూడా తయారుచేస్తున్న ఫుడ్‌ ఐటమ్స్‌పై ఉమ్మి వేసిన కేసులు నమోదయ్యాయి.

జలాలాబాద్ చౌక్‌లో ఎవర్‌గ్రీన్ పేరుతో ఓ హోటల్ ఉందని చెబుతున్నారు. హోటల్‌లో నాన్ వెజ్ ఫుడ్ దొరుకుతుంది. ఇక్కడికి వచ్చిన ఓ వ్యక్తి రోటీ తయారు చేస్తున్న వ్యక్తిని చూసి షాక్‌ అయ్యాడు. అతడు రోటీ తయారు చేసేటప్పుడు ఉమ్మి వేస్తున్నాడు. దాంతో ఇక ఆ వ్యక్తి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రోటీ చేస్తున్న వ్యక్తి చర్యను కెమెరాలో రికార్డ్‌ చేశాడు. తరువాత ఈ వీడియోను వైరల్ చేశాడు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఆర్బాజ్‌ను అరెస్టు చేశారు. ఆర్టిజన్ అర్బాజ్ ఎందుకు, ఎప్పటి నుంచి ఇలా చేస్తున్నాడు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడైన ఆర్టిజన్ పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

గతంలో కూడా ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. గత సంవత్సరం, లక్నోలోని కాకోరి ప్రాంతంలోని రోడ్డు పక్కన ఉన్న దాబాలో రోటీలు చేయడానికి పిండిపై ఉమ్మివేస్తూ పట్టుబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దీని తరువాత, ఫిబ్రవరిలో, మీరట్‌లో పిండిపై ఉమ్మి వేసినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఓ వివాహ వేడుకలో రోటీలు తయారు చేస్తూ పిండిపై ఉమ్మివేస్తూ కెమెరాకు చిక్కాడు. నిందితుడిని నౌషాద్‌గా గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రక్తం పట్టడానికి తినాల్సిన అమ్మమ్మలకాలంనాటి బియ్యం పిండి అప్పాలు
రక్తం పట్టడానికి తినాల్సిన అమ్మమ్మలకాలంనాటి బియ్యం పిండి అప్పాలు
ఖడ్గంసినిమాలో సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పింది ఈ హీరోయినా.!!
ఖడ్గంసినిమాలో సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పింది ఈ హీరోయినా.!!
ఏంది.. నెయ్యి తింటే బరువు తగ్గుతారా.. జస్ట్ ఉదయాన్నే ఇలా చేస్తే..
ఏంది.. నెయ్యి తింటే బరువు తగ్గుతారా.. జస్ట్ ఉదయాన్నే ఇలా చేస్తే..
కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం..
కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం..
ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌కు టీమిండియా 'ఖతర్నాక్' ప్లేయింగ్ 11 ఇదే
ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌కు టీమిండియా 'ఖతర్నాక్' ప్లేయింగ్ 11 ఇదే
ఉద్యోగం చేసే ఆడవాళ్ళు తినాల్సిన స్పాంజి లాంటి పుల్లట్లు
ఉద్యోగం చేసే ఆడవాళ్ళు తినాల్సిన స్పాంజి లాంటి పుల్లట్లు
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాలు.. UPSCలో ఉద్యోగ అవకాశాలు
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాలు.. UPSCలో ఉద్యోగ అవకాశాలు
యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా.. ఈ యాప్ ద్వారానే..
యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా.. ఈ యాప్ ద్వారానే..
అర్థరాత్రి వెంటాడిన మృత్యువు.. ఇంటికి చేరకుండా ముగ్గురు మృతి
అర్థరాత్రి వెంటాడిన మృత్యువు.. ఇంటికి చేరకుండా ముగ్గురు మృతి
ప్రాణాలు తీస్తున్న ఫోన్లు.. ప్రణవి విషయంలో ఏం జరిగింది?
ప్రాణాలు తీస్తున్న ఫోన్లు.. ప్రణవి విషయంలో ఏం జరిగింది?