Golden Tortoise: అద్భుతం.. ఒడిశాలో లభించిన బంగారు తాబేలు..! రైతు ఇంటికి క్యూ కట్టిన జనాలు
ఈ తాబేలును చూడటానికి తండోపతండాలుగా జనం వస్తున్నారు. ఇలాంటి తాబేళ్ళను మ్యూజియంలలో భద్రపర్చాలని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు.
Golden Tortoise: ఒడిశాలో అరుదైన తాబేలు కనిపించింది. బంగారు రంగులో దగదగా మెరిసిపోతూ భలే ఆకట్టుకుంటోంది. ఒడిషాలోని భద్రక్ జిల్లా బెంటాల్పూర్ గ్రామంలో ఓ రైతుకు కనిపించింది గోల్డెన్ టర్టైల్. బంగారం రంగులో ఉన్న ఈ తాబేలు బరువు రెండున్నర కిలోలుగా ఉంది. ఇది అపురూపమైన తాబేలు అని అటవీ శాఖ అధికారులు తెలిపారు. తేటగా ఉన్ననీటిలో ఈ తాబేలు జీవిస్తుందనీ, అందుకని ఈ తాబేలును పరిశుభ్రంగా ఉన్న నీటిలోకి తరలించినట్టు అధికారులు తెలిపారు. ఈ తాబేలును చూడటానికి తండోపతండాలుగా జనం వస్తున్నారు. ఇలాంటి తాబేళ్ళను మ్యూజియంలలో భద్రపర్చాలని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. దీన్ని సడన్‌గా చూస్తే నిజమైన బంగారమనే అనుకుంటాం. గ్రామస్తులు ఈ తాబేలును అటవీ అధికారులకు అప్పగించారు.
అంతకుముందు జూన్‌లో భద్రక్ జిల్లా ఓర్సాహి బ్లాక్‌లోని కస్తూరికానా గ్రామంలోని బైతరణి నది ఒడ్డున మరో అరుదైన పసుపు తాబేలు కూడా రక్షించబడింది. దాని బరువు దాదాపు 2 కిలోలు. యస్ తుఫాను కారణంగా అనేక అరుదైన జాతులు కస్తూరికానా గ్రామంలోకి ప్రవేశించి ఉండవచ్చు. అందులోనే అరుదైన పసుపు తాబేలు కూడా వచ్చి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి