Toothpicks: టూత్‌పిక్‌కి చివర అలాంటి డిజైన్ ఎందుకు ఉంటుంది..? దాని ప్రయోజనాలు తెలుసుకుంటే బెటర్..
టూత్‌పిక్.. రెస్టారెంట్ నుండి ఇంట్లో డిన్నర్ టేబుల్ వరకు అందుబాటులో ఉంటున్నాయి.. లంచ్ లేదా డిన్నర్ తర్వాత, ప్రతి ఒక్కరూ పళ్ళలో ఇరుక్కున్న ఆహార ముక్కను తీసివేయడానికి దీనిని ఉపయోగిస్తారు. కానీ దాని ఎడ్జ్ ఎందుకు ఉబ్బెత్తుగా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా..? అలాంటి డిజైన్ ఎందుకు ఇవ్వబడింది? దీనికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jul 06, 2022 | 9:38 AM

టూత్‌పిక్.. రెస్టారెంట్ నుండి ఇంట్లో డిన్నర్ టేబుల్ వరకు అందుబాటులో ఉంటున్నాయి.. లంచ్ లేదా డిన్నర్ తర్వాత, ప్రతి ఒక్కరూ పళ్ళలో ఇరుక్కున్న ఆహార ముక్కను తీసివేయడానికి దీనిని ఉపయోగిస్తారు. కానీ దాని ఎడ్జ్ ఎందుకు ఉబ్బెత్తుగా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా..?

అలాంటి డిజైన్ ఎందుకు ఇవ్వబడింది? దీనికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ రకమైన టూత్‌పిక్‌ను జపనీస్ టూత్‌పిక్ అని కూడా అంటారు. ఇది అత్యంత సాధారణ టూత్‌పిక్. సాదా టూత్‌పిక్‌లు కూడా ట్రెండ్‌లో ఉన్నప్పటికీ, జపనీస్ టూత్‌పిక్ ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది.

ఎందుకంటే ఇది దాని సొంత ప్రత్యేక ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. నోటి సమస్యలను నివారిస్తుంది. ఇకపోతే, ఈ డిజైన్ వెనుక ఉన్న అర్థం ఏమిటో ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా?అలాగే దాని పై భాగంలో చెక్కినట్లు కూడా ఉంటుంది. దాన్ని చాలామంది చూసినప్పటికీ పెద్దగా పట్టించుకోరు.

అలా చేయటం వెనుక ఒక కారణం ఉందట. దీంతో టూత్ పిక్‌ను టేబుల్ మీద నేరుగా పెట్టాల్సిన పని ఉండదు. టూత్ పిక్ టేబుల్‌కు అంటదు. ఫలితంగా దాన్ని మళ్లీ మనం ఉపయోగించుకోవచ్చు. అందుకోసమే టూత్ పిక్ ఫైబాగంలో అలాంటి అమరిక ఉంటుంది.

ఈ విధంగా టూత్‌పిక్‌లను తిరిగి వాడేందుకు వీలుంటుంది. అంతేకాదు, మీరు ఇతరుల టూత్‌పిక్‌లను కూడా వాడకుండా ఉండగలుగుతారు. దాంతో అంటువ్యాధులకు కూడా దూరంగా ఉంటారు. కనుక ఈసారి టూత్‌పిక్‌ను ఉపయోగిస్తే దాని పైభాగంలో ఉండే అమరికను కూడా ఉపయోగించుకోండి. సులభంగా ఉంటుంది.




