Spirulina Benefits: ఛీ ఛీ అనుకోకండి.. ఈ నాచు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో!
కొన్ని చూడటానికి, తినడానికి చిరాకు తెప్పించినా.. వాటితో ఉండే బెనిఫిట్స్ మాత్రం లెక్కనేనన్ని ఉంటాయి. ఇలాంటివి వాటిని ఏమాత్రం ఆలోచించకుండా వారి డైట్‌లో చేర్చుకునే వారు చాలా మంది ఉన్నారు. మీరు ఎన్నో రకాల ఫుడ్స్ గురించి విని, చూసి, తినే ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పబోయే ఫుడ్ గురించి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవ్వక తప్పదు. ఎందుకంటే ఈ ఫుడ్‌ని నాచుతో తయారు చేస్తారు. దీని పేరు స్పైరులనా. ఇది సముద్రపు నీటిలో పెరిగే నాచు జాతికి చెందిన మొక్క. ప్రస్తుతం వీటికి చాలా డిమాండ్..
కొన్ని చూడటానికి, తినడానికి చిరాకు తెప్పించినా.. వాటితో ఉండే బెనిఫిట్స్ మాత్రం లెక్కనేనన్ని ఉంటాయి. ఇలాంటివి వాటిని ఏమాత్రం ఆలోచించకుండా వారి డైట్‌లో చేర్చుకునే వారు చాలా మంది ఉన్నారు. మీరు ఎన్నో రకాల ఫుడ్స్ గురించి విని, చూసి, తినే ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పబోయే ఫుడ్ గురించి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవ్వక తప్పదు. ఎందుకంటే ఈ ఫుడ్‌ని నాచుతో తయారు చేస్తారు. దీని పేరు స్పైరులనా. ఇది సముద్రపు నీటిలో పెరిగే నాచు జాతికి చెందిన మొక్క. ప్రస్తుతం వీటికి చాలా డిమాండ్ ఉంది. మరి వీటి ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
స్పైరులినాలో పోషకాలు..
కాపర్, ఐరన్, ఓమేగా 6, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, బీటా కెరోటిన్, ఫైకోసైనిన్, థయామిన్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్, విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇది ప్రతి రోజూ ఒక స్పూన్ తింటే.. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి.
కొలెస్ట్రాల్ అదుపు అవుతుంది:
శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో స్పైరులినా ముఖ్య పాత్ర వహిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఓ అధ్యయనం ప్రకారం.. ప్రతి రోజూ ఒక గ్రాము స్పైరులినా తీసుకుంటే.. మూడు నెలల తర్వాత చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ గణనీయంగా తగ్గుతుంది.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:
తరచుగా స్పైరులినా తీసుకుంటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే ఖనిజాలు.. తెల్ల రక్త కణాలు, ప్రతి రోధకాల ఉత్పత్తిని పెంచుతాయని పలు పరిశోధనలు నిరూపించాయి. ముఖ్యంగా వ్యాధుల బారిన పకుండా.. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తుంది.
క్యాన్సర్ నిరోధక లక్షణాలు:
స్పైరులినాలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలో వివిధ రకాల క్యాన్సర్ కణితుల పరిమాణం తగ్గించడంలో స్పైరులినా మంచి ప్రభావం చూపించిందన్నారు. ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు.. క్యాన్సర్‌కు కారణం అయ్యే మంటతో పోరాడుతాయి.
కండరాలు బలంగా ఉంటాయి:
కండరాల అలసటను తగ్గించడంలో స్పైరులీనా సహాయ పడుతుంది. మెరుగైన కండరాల బలం, ఓర్పును ఇవ్వడంలో మంచి ఫలితాలు ఇస్తుంది. అదే విధంగా కండరాల నొప్పులు, వాపును దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.