Kalonji Seeds Benefits: మెమరీ పవర్ ని పెంచే కలోంజి సీడ్స్.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్!

కలోంజి సీడ్స్ వీటినే ఉపకుంచి, నల్ల జీల కర్ర అని కూడా అంటారు. కలోంజి విత్తనాల వాడకం పూర్వం నుంచి కూడా ఉంది. ఆయుర్వేదంలో కూడా వీటిని పలు అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. కలోంజి విత్తనాలను తీసుకోవడం వల్ల శరీరంలో ఇమ్యునిటీ లెవల్స్ అనేవి బాగా పెరుగుతాయి. దీంతో పలు వ్యాధులు, ఇన్ ఫెక్షన్లు శరీరాన్ని ఎటాక్ చేయకుండా కాపాడుతుంది. వీటిని మన ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం వల్ల చాలా రకాల సమస్యల నుంచి బయట..

Kalonji Seeds Benefits: మెమరీ పవర్ ని పెంచే కలోంజి సీడ్స్.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్!
Kalonji Seeds
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 30, 2023 | 7:25 PM

కలోంజి సీడ్స్ వీటినే ఉపకుంచి, నల్ల జీల కర్ర అని కూడా అంటారు. కలోంజి విత్తనాల వాడకం పూర్వం నుంచి కూడా ఉంది. ఆయుర్వేదంలో కూడా వీటిని పలు అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. కలోంజి విత్తనాలను తీసుకోవడం వల్ల శరీరంలో ఇమ్యునిటీ లెవల్స్ అనేవి బాగా పెరుగుతాయి. దీంతో పలు వ్యాధులు, ఇన్ ఫెక్షన్లు శరీరాన్ని ఎటాక్ చేయకుండా కాపాడుతుంది. వీటిని మన ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం వల్ల చాలా రకాల సమస్యల నుంచి బయట పడొచ్చు. మరి ఇంకా వీటితో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మెమరీ వపర్ పెరుగుతుంది:

కలోంజి సీడ్స్ తీసుకోవడం వల్ల మెమరీ పవర్ ని పెంచడంలో ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. కలోంజి సీడ్స్ పొడిలో కొంచెం తేనె కలుపుకుని తింటే క్రమ క్రమంగా మెమరీ పెరుగుతుంది. చిన్న పిల్లలకు ఇది పెట్టవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల మతి మరపు, అల్జీమర్స్ వంటివి దూరమవుతాయి.

వెయిట్ లాస్:

వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు కూడా కలోంజి సీడ్స్ ని తీసుకోవచ్చు. కలోంజీ గింజలను దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. దీన్ని మీరు తినే ఆహారంలో, సడాల్స్, జ్యూస్ లు వేటిలో అయినా కలుపుని తీసుకుంటే వెయిట్ లాస్ అవుతూ ఉంటారు.

ఇవి కూడా చదవండి

డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది:

డయాబెటీస్ ఉన్నవారు ఏ ఆహార పదార్థాలనైనా తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు కలోంజిని తీసుకోవచ్చు. కలోంజి విత్తనాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి అదుపులోకి వస్తాయి. అయితే వీటిని తీసుకునే ముందు వైద్యుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

హార్ట్ కి చాలా మంచిది:

చాలా మంది ఇప్పుడు గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్ వంటివి ఎటాక్ అయి చనిపోతున్నారు. అలాంటి వారు.. తరచూ కలోంజి విత్తనాలను తీసుకుంటే చాలా మంచింది. ఇవి రక్త నాళాల్లో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. దీంతో రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

కలోంజి విత్తనాల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల తక్షణమే ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీని వల్ల ఇతర రోగాలతో పోరాడే శక్తి శరీరానికి లభిస్తుంది. కాబట్టి ఎలాంటి వ్యాధులు, ఇన్ ఫెక్షన్లు ఎటాక్ కాకుండా హెల్దీగా ఉండొచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.