AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flax seeds: ఈ గింజలు సంజీవని అని చెప్పినా తక్కువే.. ఆడవాళ్లకు అంతకుమించి..

ఆరోగ్యాన్నిచ్చే గింజ‌ల్లో అవిసె గింజ‌ల‌కు ప్ర‌త్యేకమైన స్థాన‌ముంది.ఇందులో పీచు పదార్థం ఎక్కువ‌గా ఉంటుంది. అవిసె గింజలు ర‌క్త‌పోటును త‌గ్గిస్తాయి. స‌లాడ్ల‌లోగానీ, పాన్ కేకుల్లో గానీ లేదా ఇత‌ర ఆహార ప‌దార్థాల్లో కలిపి వీటిని తినొచ్చు. అవిసెగింజలు మహిళల ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని పచ్చిగా తినడం కన్నా... డ్రైరోస్ట్‌ చేసి, పొడిచేసుకుని తినడం మేలు.

Flax seeds: ఈ గింజలు సంజీవని అని చెప్పినా తక్కువే.. ఆడవాళ్లకు అంతకుమించి..
Flax Seeds
Ram Naramaneni
|

Updated on: Feb 18, 2024 | 2:44 PM

Share

అవిసెగింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మహిళలకు ఈ గింజల ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. బరువు తగ్గాలన్నా, నెలసరి క్రమం తప్పకూడదన్నా అవిసెగింజల్ని ఆహారంలో చేర్చుకుంటే సరిపోతుంది. ఏ శాకాహారంలోనూ లేనంత ఎక్కువగా లిగ్‌నాన్స్‌ అవిసె గింజల్లో  ఉన్నాయి.  మహిళలకు ఎంతో ఉపయోగకరమైన ఈస్ట్రోజన్‌, యాంటీ ఆక్సిడెంట్లు కలిపి ఉన్న గింజలు ఇవి. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌, రొమ్ముక్యాన్సర్‌‌ను నిర్మూలించే.. ఒమెగా-త్రీ ఆమ్లాలు అవిసె గింజల్లో ఉంటాయి.

  • అవిసె గింజల్లోని పీచు జీర్ణక్రియల వేగాన్ని పెంచుతుంది. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
  • కండరాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, నొప్పులు ఉండకూడదన్న, చురుగ్గా పనిచేయాలన్నా.. తగినంత ప్రొటీన్‌ అందాలి. ఎక్కువ మోతాదులో ప్రొటీన్‌ అందే ఆహారంలో అవిసెగింజలు కూడా ఒకటి.
  • అవిసె గింజలు కొంచెం తిన్నా కడుపు నిండుతుంది. బరువూ అదుపులో ఉంటుంది.
  • అవిసె గింజలు మెటబాలిజాన్ని మెరుగుపరుస్తాయి.
  • అవిసె గింజలు ర‌క్త‌పోటును త‌గ్గిస్తాయి. చ‌ర్మానికి మేలు చేస్తాయి.
  • చేప‌లు తిన‌ని వారు వీటిని తీసుకుంటే.. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా అందుతాయి. ఇవి మ‌న గుండెకు మేలు చేసే మంచి కొవ్వులు.
  • అవిసె గింజల్లో మనకు అవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫైబర్‌, విటమిన్‌ బి1, బి6, క్యాల్షియం, ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియం, ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు దొరుకుతాయి
  • రోజుకు రెండు చెంచాల అవిసె గింజలు తీసుకుంటే ప్రీ, పోస్ట్‌ మెనోపాజల్‌ దశలో వచ్చే ఇబ్బందులకు చెక్‌ పెట్టొచ్చు.
  • చాలామంది మహిళల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాల లోపం వల్ల శరీరభాగాల్లో నీరు రావడం, వాపులు, నొప్పి వంటివి ఎక్కువగా ఉంటాయి.
  • అవిసెగింజలు హార్మోన్లను సమతులం చేస్తాయి. ఒమేగా-3 యాసిడ్లు కొలెస్ట్రాల్‌ స్థాయుల్ని నియంత్రిస్తాయి.

అయితే అలర్జీలు, థైరాయిడ్‌… గ్యాస్‌ సమస్యలున్నవారు, గర్భిణులు, బాలింతలు అవిసె గింజలకు దూరంగా ఉండటమే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటిల్లోని సైనోజెన్‌ అని రసాయనం థైరాయిడ్‌ సమస్యని మరింత తీవ్రం చేస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..