Bulletproof Coffee Health Benefits: ఆరోగ్యాన్ని కాపాడే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ.. ఇంకెందుకు లేట్ మీరూ ట్రై చేయండి!!
సాధారణంగా ఉదయం లేవగానే.. చాలా మందికి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదే కానీ.. పరగడుపున తాగడం, రోజుకు 3-4 సార్లు అదే పనిగా కాఫీ తాగడం అంత మంచిది కాదని వైద్యులు సూచిస్తుంటారు. ఉదయాన్నే కాఫీ తాగితే ఆ రోజంతా ఎంతో హుషారుగా ఎనర్జిటిక్ గా ఉంటారు. ఇక కాఫీ లవర్స్ అయితే రకరకాల కాఫీలను టేస్ట్ చేస్తుంటారు. కోల్డ్ కాఫీ, బ్లాక్ కాఫీ, చాక్లెట్ కాఫీ, ఫిల్టర్ కాఫీ, బ్లాక్ కాఫీ.. అబ్బో చాలా రకాలున్నాయి. మరి మీరు బుల్లెట్ ప్రూఫ్..
సాధారణంగా ఉదయం లేవగానే.. చాలా మందికి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదే కానీ.. పరగడుపున తాగడం, రోజుకు 3-4 సార్లు అదే పనిగా కాఫీ తాగడం అంత మంచిది కాదని వైద్యులు సూచిస్తుంటారు. ఉదయాన్నే కాఫీ తాగితే ఆ రోజంతా ఎంతో హుషారుగా ఎనర్జిటిక్ గా ఉంటారు. ఇక కాఫీ లవర్స్ అయితే రకరకాల కాఫీలను టేస్ట్ చేస్తుంటారు. కోల్డ్ కాఫీ, బ్లాక్ కాఫీ, చాక్లెట్ కాఫీ, ఫిల్టర్ కాఫీ, బ్లాక్ కాఫీ.. అబ్బో చాలా రకాలున్నాయి. మరి మీరు బుల్లెట్ ప్రూఫ్ కాఫీని ఎప్పుడైనా ట్రై చేశారా? అంటే కాఫీలో బుల్లెట్ ఉంటుందనుకునేరు. కాదండీ.. మన డీజే టిల్లు సినిమాలో హీరో చెప్తాడు చూడండి.. కాఫీలో నెయ్యి వేసుకుని తాగుతాం అని.. ఆ కాఫీ. గుర్తొచ్చిందా ?
సినిమాల్లో చూడటమే కానీ.. రియల్ గా ఎప్పుడూ ట్రై చేసి ఉండరు కదూ. ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ (ఘీ కాఫీ) తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందామా.
బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగిన తర్వాత ఆహారాన్ని తీసుకుంటే.. ఇన్సులిన్ నెమ్మదిగా విడుదలవుతుంది. కాబట్టి షుగర్ ఉన్నవారు ఈ నేతికాఫీని ఎంచక్కా తాగొచ్చు. అలాగే యువతులు, మహిళల్లో ఇప్పుడు హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ సమస్య ఎక్కువగా ఉంటోంది. ఫలితంగా పీసీఓడీ, పీసీఓఎస్ వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. అలాంటి వారు కూడా ఈ నేతి కాఫీని తాగితే.. మీరు రోజంతా యాక్టివ్ గా ఉంటారు. నెయ్యిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి కాబట్టి.. ఇతర ఆహారాలను తినాలన్న కోరిక తగ్గుతుంది. అంతేకాదు పొట్టచుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది.
నెయ్యి అనగానే.. అది శరీరంలో కొవ్వును పెంచే పదార్థంగా భావిస్తాం కానీ.. నిజానికి నెయ్యి తినడం వల్ల కొవ్వు పెరగదు. పిల్లలకు చిన్నప్పటి నుంచీ నెయ్యిని అలవాటు చేయకపోవడం వల్లే వారు శారీరకంగా స్ట్రాంగ్ గా ఉండటం లేదు. కాఫీలో ఒక్క స్పూన్ నెయ్యి కలుపుకుని పరగడుపునే తాగితే.. చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రం ఈ బుల్లెట్ ప్రూఫ్ తాగొద్దంటున్నారు డైటీషియన్స్. ఎందుకంటే నిద్రలేమి సమస్య వచ్చే ప్రమాదం ఉందట. రోజుకి రెండుసార్లకు మించి కూడా తాగకూడదు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి