Mustard Benefits: ఆవాలతో ఆహా అనిపించే ప్రయోజనాలు.. కానీ జాగ్రత్త సుమీ!!
ఆవాలు.. భారతీయులు వాడే వంటింటి దినుసుల్లో ఒకటి. మంచి పోపు వేయాలంటే ఎవరికైనా ముందు ఆవాలే గుర్తొస్తాయి. ఆవాలను రెగ్యులర్ గా వంటల్లో ఉపయోగించడం వల్ల టేస్ట్, సువాసన వస్తుంది. అయితే ఆవాలతో మంచి ప్రయోజనాలు ఉన్నాయని తెలుసు. ప్రస్తుతం ఈ ఆవాలు తెలుపు, గోధుమ, నలుపు రంగుల్లో లభిస్తున్నాయి. కానీ ఆవాలతో మీకు తెలియని సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. మరి ఆవాలను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో..
ఆవాలు.. భారతీయులు వాడే వంటింటి దినుసుల్లో ఒకటి. మంచి పోపు వేయాలంటే ఎవరికైనా ముందు ఆవాలే గుర్తొస్తాయి. ఆవాలను రెగ్యులర్ గా వంటల్లో ఉపయోగించడం వల్ల టేస్ట్, సువాసన వస్తుంది. అయితే ఆవాలతో మంచి ప్రయోజనాలు ఉన్నాయని తెలుసు. ప్రస్తుతం ఈ ఆవాలు తెలుపు, గోధుమ, నలుపు రంగుల్లో లభిస్తున్నాయి. కానీ ఆవాలతో మీకు తెలియని సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. మరి ఆవాలను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
-ఆవాల్లో డైటరీ ఫాట్స్, కార్బొహైడ్రేట్స్, ఫాట్, బటా కెరోటిన్, విటమిన్ ఏ, బి1, నుంచి బి6 వరకు, బి9, సి, ఇ, కె, పొటాషియం, సోడియం వంటివి అధిక మోతాదులో ఉంటాయి. పోషకవిలువలతో పాటుగా ఆవాలు ఎన్నో ఔషధ గుణాలు కూడా కలిగి ఉన్నాయి.
-చల్లదనంతో కీళ్లు బిగదీసుకుపోయి నొప్పిని కలిగించిన సందర్భాల్లో ఆవాలు చక్కగా పని చేస్తాయి. ఇవి వాతాన్ని క్రమ పద్దతిలోకి తీసుకువస్తుంది. నొప్పిని, వాపుని నిరోధిస్తాయి.
-వీటిలో ఉండే పోషకాలు మనకు వ్యాధులు రాకుండా కాపాడి వ్యాధి నిరోధకతను పెంచుతాయి. శ్వాసకోశ సమస్యలు, నొప్పులు, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఆవాలను తింటే మంచి ప్రయోజనం లభిస్తుంది..
-ఆవాల్లో ఉండే కాపర్, ఐరన్, మెగ్నీషియం, సెలీనియంలు హైబీపీని తగ్గిస్తాయి.
-వీటిల్లో ఉండే మ్యూసిలేజ్ అనే చిక్కటి పదార్థం విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. శరీర మెటబాలిజం పెరుగుతుంది.
-ఫంగస్, ఇతర చర్మ ఇన్ ఫెక్షన్లు ఉన్నవారు ఆవాలను తినడం ద్వారా ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
-ఆవాల్లోని మెగ్నీషియం శరీరంలో తయారయ్యే క్యాన్సర్ కారకాలను గుర్తించి నాశనం చేస్తుంది.
-ఆవాల నుంచి తీసిన నూనెలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు ఎదుగుదలకు దోహదపడుతుంది.
అయితే ఆవాలను తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. వీటిలోని ఘాటైన ద్రవ్యాలు మనకు పైత్యాన్ని పెంచుతాయి. కడుపుమంట, చర్మ సమస్యలు ఉన్నవారు పోపులకే పరిమితమైతే మంచింది. వీటిల్లో ఉండే గోయిట్రోజెన్ అనే పదార్థం జీవక్రియలను నియంత్రిస్తాయి. అందుకని మితంగా తీసుకుంటేనే మేలు జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి