Hair Tips: ఉల్లిపాయను ఇలా వాడితే.. ఒత్తైన జుట్టు మీసొంతం!!

'ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు' అనే సామెత ఊరికే రాలేదు. అంతలా ఉల్లిపాయలో మంచి ఔషధ గుణాలున్నాయి. అందులోనూ జుట్టు రాలిపోతుందనే వారికి చక్కటి పరిష్కారం ఉల్లిపాయ. దీన్ని ఆయుర్వేదంలో కూడా ఎన్నో వాటికి ఉపయోగిస్తారు. సాధారణంగా ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. ఈ సల్ఫర్ రక్త ప్రవాహాన్ని పెంచడంతో పాటు కొల్లాజెన్ ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర..

Hair Tips: ఉల్లిపాయను ఇలా వాడితే.. ఒత్తైన జుట్టు మీసొంతం!!
Onion
Follow us
Chinni Enni

|

Updated on: Jul 31, 2023 | 4:25 PM

‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు’ అనే సామెత ఊరికే రాలేదు. అంతలా ఉల్లిపాయలో మంచి ఔషధ గుణాలున్నాయి. అందులోనూ జుట్టు రాలిపోతుందనే వారికి చక్కటి పరిష్కారం ఉల్లిపాయ. దీన్ని ఆయుర్వేదంలో కూడా ఎన్నో వాటికి ఉపయోగిస్తారు. సాధారణంగా ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. ఈ సల్ఫర్ రక్త ప్రవాహాన్ని పెంచడంతో పాటు కొల్లాజెన్ ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

*ఉల్లి రసం, బాదం నూనె మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి మసాజ్ చేసి ఓ అరగంట పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మీకు చక్కటి రిజల్ట్ కనిపిస్తుంది. బాదం నూనెతో జుట్టుకు మెరుపువస్తుంది. అలాగే ఉల్లి రసంతో జట్టును సాఫ్ట్ చేయడంతో పాటు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

*ఉల్లి రసం, ఆలీవ్ ఆయిల్ కూడా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఈ మిశ్రమాన్ని తలకు బాగా రాసి, మసాజ్ చేసి ఓ 30 నిమిషాలు అలా వదిలేయండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒక్కసారైనా ఇలా చేస్తే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

*ఉల్లి రసం, నిమ్మరసం కాంబినేషన్ కూడా జుట్టుకు మంచి కండీషనర్ గా పని చేస్తుంది. దీంతో జుట్టు రాలడంతో పాటు మృదువుగా తయారవుతాయి. చుండ్రు కూడా తగ్గుతుంది. ఈ మిశ్రమాన్ని తలకు రాసి, మసాజ్ చేసి ఓ 15 నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తర్వాత షాంపూతో జుట్టును కడిగేయాలి.

*ఉల్లిపాయ-పెరుగు కాంబినేషన్ కూడా జుట్టు రాలడాన్ని తగ్గించి సాఫ్ట్ గా తయారు చేసింది. ఈ రెండింటి మిశ్రమాన్ని తలకు రాసి ఓ 45 నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.

ఇలా పైన చెప్పిన విధంగా ఉల్లిరసంతో పలు చిట్కాలు ట్రై చేస్తూ ఉంటే జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం