Pollution: వాయు కాలుష్యంతో ఆస్తమానే కాదు.. ఈ 5 వ్యాధులు కూడా వచ్చే ప్రమాదముంది..!
Pollution: పెరుగుతున్న వాతావరణ కాలుష్యం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులకు..

Pollution: పెరుగుతున్న వాతావరణ కాలుష్యం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులకు సంబంధించి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అయితే, చాలా మంది కాలుష్యం కారణంగా ఆస్తమా మాత్రమే వస్తుందని భావిస్తారు. కానీ, కాలుష్యం వల్ల ఆస్తమా మాత్రమే కాకుండా గుండె జబ్బులు, చర్మ అలెర్జీలు, కంటి వ్యాధులు కూడా వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 7 మిలియన్లకు పైగా ప్రజలు కాలుష్యం కారణంగా మరణిస్తున్నారు. గాలి నాణ్యత క్షీణించడం వల్ల శరీరంలో అనేక ఇతర వ్యాధులు వచ్చి ప్రాణాలు కోల్పోతున్నారు. కాలుష్యం కారణంగా వచ్చే వ్యాధులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
న్యుమోనియా.. న్యుమోనియా ఒక సాధారణ సమస్య. ఈజీగా తగ్గిపోతుంది కూడా. అధిక కాలుష్యం కారణంగా న్యుమోనియా ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.
స్ట్రోక్.. ఇటీవలి కాలంలో చాలా మంద్రి బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ కు గురవుతున్నారు. పెరుగుతున్న కాలుష్యం కారణంగా యువకులు సైతం పక్షవాతం బారిన పడుతున్నారు.
ఊపిరితిత్తుల క్యాన్సర్.. ఊపిరితిత్తుల క్యాన్సర్ వివిధ కారణాల వల్ల సంభవించే అవకాశం ఉంది. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే వ్యక్తులకు లంగ్స్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరిగింది.
గుండె వ్యాధులు.. వాయు కాలుష్యం, ఉష్ణోగ్రతల స్థాయి పెరుగుదల కారణంగా గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. గుండె జబ్బుల కారణంగా, గుండె, మెదడు, ఇతర అవయవాలకు ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలుగుతుంది. ఇది గుండెపోటు ప్రమాదం పెంచుతుంది.
చర్మ సమస్యలు.. కాలుష్యం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ముఖ్యంగా చిన్న పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. కాలుష్యం వల్ల చర్మంపై దద్దుర్లు, దురదలు వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా చర్మ క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలు కూడా రావచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..