AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goat Milk: మేకపాలు చేసే మేలు.. ఆ సమస్యలు ఉన్నవారికి అమృతంతో సమానం..

మేకపాలను పూర్వం ఎన్నో విధాల చికిత్సల్లో ఉపయోగించేవారు. బలహీనంగా ఉన్నవారికి వీటినే తాగించేవారు. క్రమేణా వీటి ప్రయోజనాలపై అవగాహన లేకపోవడం వల్ల డైలీ లైఫ్ లో వీటి వాడకం తగ్గిపోయింది. కానీ, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు మేకపాలు దివ్య ఔషధంలా పనిచేస్తాయని మీకు తెలుసా..

Goat Milk: మేకపాలు చేసే మేలు.. ఆ సమస్యలు ఉన్నవారికి అమృతంతో సమానం..
Goat Milk Health Benefits
Bhavani
|

Updated on: Feb 19, 2025 | 5:16 PM

Share

పోషకాల లేమితో బాధపడేవారైనా.. అరుగుదల మందగించినా సరే ఎన్నో రకాల సమస్యలకు మేక పాలను వాడుకోవచ్చు. ఇవి సులభంగా జీర్ణం కావడమే కాదు. ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. పాల ఎలర్జీ ఉన్నవారు సైతం వీటిని భేషుగ్గా తీసుకోవచ్చు. మేకపాలలో గాయాలను మాన్పించే గుణం ఉంది. గాంధీజీకి రోజూ మేకపాలు తీసుకునే అలవాటు ఉండేది. వీటిని తాగమని అందరినీ ఆయన ప్రోత్సహించేవారట. శరీరానికి పూర్తి పోషణ అందించే ఆహారాలలో ఇవి కూడా ఒకటి.

ఎముకలు, దంతాల పుష్టికి..

మేక పాలల్లో ఎముకలు, దంతాల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు మెండుగా ఉన్నాయి. ఇందులో కాల్షియం, ఫాస్పరస్ వంటివి మీ శరీరంలో పోషకాల లేమిని తగ్గిస్తాయి. అలాగే జీర్ణక్రియకు ఉపయోగపడతాయి.

ఎ, బి, డి విటమిన్లు అందుతాయి..

మేకపాలల్లో విటమిన్ ఎ, బి, డిలు అధిక మొత్తంలో ఉన్నాయి. ఇవి మొత్తం మీ శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సాయపడతాయి. ఇదొక మంచి ప్రొటీన్ సోర్స్ గానూ ఉపయోగపడుతుంది. ఇందులో ఈ విటమిన్లతో పాటుగా కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నిషియం, విటమిన్ ఎలు పుష్కలంగా ఉంటాయి.

ప్రొబయోటిక్స్ కావాలా..?

ఈ పాలలో ఉండే ప్రొబయోటిక్స్ కారణంగా పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తరచుగా డయోరియా, పేగుల్లో సమస్యలు వంటివి ఎదుర్కునే వారు మేకపాలను తీసుకోవాలి. అలాగే ఇది మీ ఇమ్యూన్ సిస్టంను బలపరిచి, కొలెస్ట్రాల్ స్థాయిని కూడా అదుపులో ఉంచుతుంది.

పాలు పడని వారికి..

చాలా మందికి పాల పదార్థాలతో అలర్జీ ఉంటుంది. పాలల్లో ఉండే లాక్టోస్ పడకపోవడం వల్లే ఇలా జరుగుతుంది. అయితే సాధానణ పాలతో పోలిస్తే ఇందులో లాక్టోస్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. సున్నితమైన జీర్ణవ్యవస్థ కలిగినవారు ప్రొటీన్ కోసం ఈ పాలను తాగొచ్చు.

బరువు పెరగాలా..

ఎంత తిన్నా తిన్నది ఒంటికి పట్టకుండా కండ పుష్టి లేకుండా ఉంటారు కొందరు. అలాంటి వారు మేకపాలు తాగడం వల్ల ఈజీగా బరువు పెరుగుతారు. ఇందులో ఉండే ఎక్స్ ట్రా కేలరీలు హెల్తీ వెయిట్ గెయిన్ ను ప్రమోట్ చేస్తాయి.

ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి…

మేక పాలలో ఉండే ప్రొటీన్ల కారణంగా ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. దీని కారణంగా కొందరిలో ఆస్తమా, ఆర్థరైటిస్, అలెర్జీల సమస్య ఎదురవుతుంది. వారందరికీ ఇదొక మంచి పరిష్కారంగా చెప్పొచ్చు.

గుండె జబ్బుల నుంచి రక్ష..

కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి విటమిన్లు అధిక మొత్తంలో ఉండటం వల్ల మేకపాలు గుండె జబ్బులను నివారించడంలో సాయపడతాయి.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది…

అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో గుండె జబ్బులతో పాటు ఎన్నో రకాల వ్యాధుల ముప్పు ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గించుకుని జీవనశైలిని మార్చుకోవాలనుకునే వారు కచ్చితంగా మేకపాలను డైట్ లో చేర్చుకోవాలి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావవంతంగా తగ్గించగలవు.

ఎత్తు పెరగట్లేదా..

చాలా మంది పిల్లలు వయసుకు తగ్గ ఎత్తు, బరువు ఉండరు. అలాంటి వారికి మేకపాలను రోజూ తాగించాలి. వీటిలో ఉండే అధిక స్థాయి ప్రొటీన్ కణజాలాన్ని, కండరాలను నిర్మించడంలో సాయపడుతుంది. తద్వారా ఎత్తు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.