ఇండియా తరపున ‘గల్లీ బాయ్’.. ఆస్కార్ గెలుస్తాడా.?
2020 ఫిబ్రవరిలో జరిగే ఆస్కార్ అవార్డుల కోసం భారతదేశం తరపున బాలీవుడ్ మూవీ ‘గల్లీ బాయ్’ నామినేట్ అయింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకురాలు జోయా అక్తర్ తెరకెక్కించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడమే గాక 2019 బ్లాక్‌బస్టర్ హిట్స్ జాబితాలో టాప్ 10లో నిలిచింది. ఇక తాజాగా ఈ సినిమా ఆస్కార్ 2020కి ఎంపిక […]

2020 ఫిబ్రవరిలో జరిగే ఆస్కార్ అవార్డుల కోసం భారతదేశం తరపున బాలీవుడ్ మూవీ ‘గల్లీ బాయ్’ నామినేట్ అయింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకురాలు జోయా అక్తర్ తెరకెక్కించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడమే గాక 2019 బ్లాక్‌బస్టర్ హిట్స్ జాబితాలో టాప్ 10లో నిలిచింది.
ఇక తాజాగా ఈ సినిమా ఆస్కార్ 2020కి ఎంపిక కావడం విశేషం. మొత్తానికి 27 చిత్రాలతో పోటీపడి ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో ఇండియా తరపు నుంచి ఎంపికైంది. ఈ విషయాన్ని నిర్మాత ఫరాన్ అక్తర్ తన ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలియజేశారు. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.ఎఫ్.ఐ) పోటీపడుతున్న మొత్తం 28 చిత్రాలను పరిశీలించిన తర్వాత ‘గల్లీ బాయ్’ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఇక ఈ ఏడాది ఆస్కార్ ఇండియా జూరీ కమిటీకి అపర్ణాసేన్ అధ్యక్షురాలిగా ఉన్నారు. ‘గల్లీ బాయ్’ సినిమాకు క్రిటిక్స్ సైతం ప్రశంసలు కురిపించారు. ముంబైలోని ఒక గల్లీ కుర్రాడు ఎలా ర్యాపర్‌గా ఎదిగాడు అనేది ఈ కథాంశం. రియాలిటీకి దగ్గరగా ఉండేలా దర్శకురాలు జోయా ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. విమర్శకుల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరూ కూడా ఈ మూవీకి వందకు వంద మార్కులు వేశారు. కాగా 92వ అకాడెమీ(ఆస్కార్) అవార్డుల్లో గల్లీ బాయ్ ఆస్కార్‌ను గెలుచుకుంటుందా లేదా? అనేది వేచి చూడాలి.
Apna Time Aayega! #ZoyaAkhtar @aliaa08 @ritesh_sid @FarOutAkhtar @SiddhantChturvD @kalkikanmani @kagtireema @MrVijayVarma @excelmovies @tigerbabyindia @ZeeMusicCompany pic.twitter.com/CShSFdQjdo
— Ranveer Singh (@RanveerOfficial) September 21, 2019
Bohot harddddddd ❤️❤️❤️ @RanveerOfficial #ZoyaAkhtar @ritesh_sid @FarOutAkhtar @excelmovies @SiddhantChturvD @kalkikanmani @kagtireema @ZeeMusicCompany pic.twitter.com/i1P3I8npq0
— Alia Bhatt (@aliaa08) September 21, 2019
#GullyBoy has been selected as India’s official entry to the 92nd Oscar Awards. #apnatimeaayega Thank you to the film federation and congratulations #Zoya @kagtireema @ritesh_sid @RanveerOfficial @aliaa08 @SiddhantChturvD @kalkikanmani & cast, crew and hip hop crew. ?? pic.twitter.com/Eyg02iETmG
— Farhan Akhtar (@FarOutAkhtar) September 21, 2019