- Telugu News Sports News Cricket news SRH Player Ishan Kishan South Dating With South Actress Pragya Nayan Singh in Middle of IPL 2025
IPL 2025: సౌత్ నటితో SRH ఫెయిల్యూర్ ప్లేయర్ చెట్టాపట్టాల్.. ఫొటో చూస్తూ ఫ్యూజుల్ ఔటవ్వాల్సిందే..
SRH Player Ishan Kishan Dating With South Actress: ఐపీఎల్ 2025లో, ఇషాన్ కిషన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున అద్భుతంగా ఆడాడు. కానీ, గత ఐదు ఇన్నింగ్స్‌లలో దారుణంగా విఫలమయ్యాడు. దీని కారణంగా అతని ప్రదర్శనపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. ఈ సీజన్‌లో ఆడిన ఏడు ఇన్నింగ్స్‌లలో ఇషాన్ కేవలం 140 పరుగులు మాత్రమే చేశాడు.
Updated on: Apr 27, 2025 | 2:08 PM

భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ ప్రస్తుతం ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు. ఇషాన్ తన పేలవమైన ఫామ్ కారణంగా వార్తల్లో నిలుస్తున్నాడు. సెంచరీ చేసిన తర్వాత, ఇషాన్ కిషన్ బ్యాట్ పూర్తిగా నిశ్శబ్దంగా మారింది. దీంతో ఇషాన్ చాలా ట్రోలింగ్ ఎదుర్కోవలసి వచ్చింది. కానీ, ఈసారి టోర్నమెంట్ సమయంలో, ఇషాన్ కిషన్ కొత్త ప్రేమికురాలు వెలుగులోకి వచ్చింది. తన ప్రేయసి అదితిని విడిచిపెట్టి, ఇప్పుడు కొత్త అందాల సుందరితో రిలేషన్‌షిప్ ప్రారంభించాడని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే, ఇషాన్ కిషన్ అదితితో విడిపోయిన తర్వాత, ప్రముఖ సౌత్ నటి ప్రగ్యా నయన్ సింగ్‌తో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ పార్టీలో వీరిద్దరూ కలిసి కనిపించారు. దీంతో వీరి రిలేషన్‌షిప్ నిజమేనని అంటున్నారు.

ఐపీఎల్ 2025లో, ఇషాన్ కిషన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున అద్భుతంగా ఆడాడు. కానీ, గత ఐదు ఇన్నింగ్స్‌లలో దారుణంగా విఫలమయ్యాడు. దీని కారణంగా అతని ప్రదర్శనపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. ఈ సీజన్‌లో ఆడిన ఏడు ఇన్నింగ్స్‌లలో ఇషాన్ కేవలం 140 పరుగులు మాత్రమే చేశాడు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతను గత ఏడు మ్యాచ్‌లలో కేవలం 34 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

అదితి హుండియా, ఇషాన్ కిషన్ మధ్య రిలేషన్ గురించి చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే, ఇద్దరూ చాలా కాలంగా డేటింగ్ చేశారు. కానీ, ఇప్పుడు వారిద్దరి మధ్య సంబంధం ముగిసిందని అంటున్నారు. ఇటీవల ఇషాన్ కిషన్ ఒక నటితో ఒక ఫంక్షన్‌లో కనిపించాడు. ఆ తర్వాత ఇప్పుడు ఒక అందమైన మహిళతో డేటింగ్ ప్రారంభించాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ సంబంధానికి సంబంధించి వీరిద్దరూ ఎటువంటి అధికారిక స్పందన లేదా ప్రకటన ఇవ్వలేదు.

గత కొన్ని ఇన్నింగ్స్‌లలో, అతను ఒక్కసారి మాత్రమే రెండంకెల మార్కును దాటగలిగాడు. చాలాసార్లు ఖాతా కూడా తెరవకుండానే ఔటయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలోనే కాకుండా ప్లేఆఫ్‌ల నుంచి కూడా చాలా వెనుకబడి ఉంది. ఇప్పుడు ఒక అద్భుతం మాత్రమే జట్టును ప్లేఆఫ్‌లకు తీసుకెళ్లగలదు.



















