AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

White Jamun: మీరెప్పుడైనా తెల్ల నేరేడు గురించి విన్నారా?.. దాన్ని తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా!

మనలో చాలా మందికి నేరేడు పండ్లు తెలుసు. ఎలా ఉంటాయి.. కాస్త వగరుగా, కొంచెం పుల్లగా , కొంచెం తియ్యగా మొత్తంగా తింటే నాలుక రంగు మారిపోతుంది. అయితే నల్ల నేరేడుతో పాటు తెల్ల నేరేడు పండ్లు ఉంటాయని మీకెవరికైనా తెలుసా.. వీటిని తినడం వల్ల ఎన్నిలాభాలున్నాయో తెలుసా? ఆకారంలో వాటికి కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ ఆరోగ్య పోషకాలు అందించడంలో మాత్రం వాటికి మించినవి.

White Jamun: మీరెప్పుడైనా తెల్ల నేరేడు గురించి విన్నారా?.. దాన్ని తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా!
White Jamun
B Ravi Kumar
| Edited By: |

Updated on: Apr 27, 2025 | 1:04 PM

Share

మనలో చాలా మందికి నేరేడు పండ్లు తెలుసు. ఎలా ఉంటాయి.. కాస్త వగరుగా, కొంచెం పుల్లగా , కొంచెం తియ్యగా మొత్తంగా తింటే నాలుక రంగు మారిపోతుంది. అయితే నల్ల నేరేడుతో పాటు తెల్ల నేరేడు పండ్లు ఉంటాయని మీకెవరికైనా తెలుసా.. వీటిని ఎప్పుడైనా చూశారా? ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి.. ఇవి మార్కెట్ లో ఎక్కువగా కనిపించవు. ఆకారంలో వాటికి కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ ఆరోగ్య పోషకాలు అందించడంలో మాత్రం వాటికి మించినవి. ఆయుర్వేదంలో కూడా తెల్ల నేరేడు పండ్ల ప్రస్తావన ఉంది. వీటిని తినమని ఆయుర్వేదం కూడా సూచిస్తుంది. అయితే ఆరోగ్యం పట్ల ఆలోచన ఉన్న కొందరు రైతులు మాత్రమే వీటిని పండిస్తున్నారు. ప్రస్తుతం సీజన్‌లో ఈ పండ్లు కాపు దశకు వచ్చి చెట్లపై కాయలతో కళ కళ లాడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నేరేడు పండ్లను అల్ల నేరేడు అని కూడా పిలుస్తారు. అయితే నల్ల నేరేడు కంటే తెల్ల నేరేడు పండ్లలో ఎన్నో ఔషధగుణాలు ఉంటాయని తెలుస్తోంది. మార్కెట్‌లో ఈ మొక్క వంద నుంచి రూ.150 వరకు దొరుకుతుంది.

ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న పుప్పాల వెంకట్రావు కు తూర్పుగోదావరి జిల్లా రావూరి పాడులో వ్యవసాయ భూమి ఉంది. అందులో వేసిన తెల్ల నేరేడు చెట్టుకు ఈ ఏడాది విపరీతంగా కాపుకు వచ్చింది. చెట్టు తొలికాపు కాపు కావటంతో ఆయన పండ్లను కోసి హైదరాబాద్ లోని తన స్నేహితులకు రుచి చూపించేందుకు పట్టుకెలుతున్నట్లు చెబుతున్నారు. ఏదైనా ప్రత్యేకంగా ఉంటే వాటి పట్ల ఆసక్తి ఉంటుంది అందులోనూ ఆరోగ్యప్రయోజనాలు ఉంటే ఖరీదైనా వినాయోగం తప్పనిసరిగా మారుతుంది. ఇప్పటికే సాదారణ నేరేడులో హైబ్రిడ్ కాయలు వచ్చేశాయి. కమర్షియల్ క్రాప్ గాను కొందరు పెంచుతున్నారు. భవిష్యత్తులో ఈ స్ధానంలో కి తెల్లనేరేడు వచ్చి చేరే అవకాశం కూడా కనిపిస్తుంది.

ఈ తెల్ల నేరేడు పండ్లలో చాలా పోషకాలు ఉంటాయట.. వీటిని ఆయుర్వేదంలో కూడా వాడుతారని నిపుణులు చెబుతున్నారు . వీటిని ఈ పండ్లు వేసవికాలంలో తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇవి మన శరీరాన్ని వడదెబ్బ నుంచి కాపాడతాయిట. వేడి సంబంధ అనారోగ్యాలను కూడా దూరం చేయస్తాయట. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఎక్కువ. కాబట్టి వీటిని తినడం వల్ల వేసవిలో బ్యాక్టీరియా, వైరస్‌ల వల్ల వచ్చే చాలా రోగాలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…