చైతూ ఫస్ట్ వైఫ్ గురించి.. సామ్ మాటల్లోనే..
‘ఏమాయ చేసావె’, ‘ఆటోనగర్ సూర్య’, ‘మనం’ చిత్రాల్లో అక్కినేని నాగచైతన్య, సమంతా కలిసి నటించారు. ఇక ఇద్దరూ కూడా 2017లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ ‘మజిలీ’ సినిమా తీసి బ్లాక్‌బస్టర్ హిట్ సాధించాడు. ఇది ఇలా ఉంటే సమంతా తన వ్యక్తిగత విషయాలను తరుచూ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. తాజాగా మంచులక్ష్మి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ కార్యక్రమంలో పాల్గొన్న సమంత.. చైతన్య […]

‘ఏమాయ చేసావె’, ‘ఆటోనగర్ సూర్య’, ‘మనం’ చిత్రాల్లో అక్కినేని నాగచైతన్య, సమంతా కలిసి నటించారు. ఇక ఇద్దరూ కూడా 2017లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ ‘మజిలీ’ సినిమా తీసి బ్లాక్‌బస్టర్ హిట్ సాధించాడు. ఇది ఇలా ఉంటే సమంతా తన వ్యక్తిగత విషయాలను తరుచూ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది.
తాజాగా మంచులక్ష్మి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ కార్యక్రమంలో పాల్గొన్న సమంత.. చైతన్య గురించి ఇంటరెస్టింగ్ విషయాలను ప్రేక్షకులకు తెలియజేసింది. ఈ సందర్భంగా ‘పెళ్లికి ముందుకు చై నువ్వు సహజీవనం చేశారంట కదా? నువ్వు సింగిల్ ఉన్నప్పటికి, చైతో కలిసి ఉన్నప్పటికి బెడ్‌రూంలో వచ్చిన మార్పులు ఏమిటి?’ అని మంచు లక్ష్మి సమంతను సరదాగా అడిగారు. దీనికి సమంత కొంత సమయం ఆలోచించి.. ‘దిండు.. చై మొదటి భార్య. ఒకవేళ నేను ఆయన్ని ముద్దుపెట్టుకున్నా మా ఇద్దరి మధ్య దిండు అడ్డంగా ఉండేది’ అంటూ సమాధానం ఇచ్చింది సమంత.