Tollywood : రామ్ చరణ్‌తో క్రేజీ మూవీ.. 16 ఏళ్లల్లో ఒకే ఒక్క హిట్టు అందుకున్న హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ ప్లాప్..
తండ్రి రాజకీయాల్లో పెద్ద నాయకుడు. కుటుంబంలో చాలా మంది పొలిటిషియన్స్ గా కొనసాగుతున్నారు. కానీ ఆమె మాత్రం నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. మోడలింగ్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడుకు అదృష్టం మాత్రం కలిసిరాలేదు. ఈ హీరోయిన్ ఫస్ట్ మూవీ తెలుగులోనే చేసింది.

రాజకీయ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 16 ఏళ్ల సినీప్రయాణం ఇప్పటివరకు కేవలం ఒక్క హిట్టు మాత్రమే అందుకుంది. అందం, అభినయంతో మంచి మార్కులే కొట్టేసింది. కానీ నటిగా అవకాశాలకు మాత్రం ఆమడ దూరంలోనే ఉండిపోయింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ప్రస్తుతం సినీరంగంలో నటీనటులుగా కొనసాగుతున్న స్టార్స్ దాదాప రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినవారే. భూమి పెడ్నేకర్, ఆయుష్ శర్మ, అరుణోదయ్ సింగ్ వంటి నటులు తమ కుటుంబ వారసత్వాన్ని వదిలి సినిమా పరిశ్రమకు తిరిగి వచ్చారు. వీరిలో కొందరు మాత్రమే సినిమాల్లో విజయం సాధించగలిగారు. మరికొందరు సహాయక పాత్రలతో సరిపెట్టుకున్నారు. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే నటి మాత్రం ఇండస్ట్రీలో స్టార్స్ అందరితో కలిసి పనిచేసింది. అనేక సినిమాల్లో నటించి మెప్పించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మరెవరో కాదు హీరోయిన్ నేహా శర్మ.
2007లో చిరుత సినిమాతో సినీప్రయాణం స్టార్ట్ చేసింది నేహా శర్మ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత 2009లో కుర్రాడు అనే సినిమాతో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. 2010లో హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. నేహా శర్మ రామ్ చరణ్, ఇమ్రాన్ హష్మీ వంటి స్టార్ హీరోలకు జోడిగా కనిపించింది. 2010లో వచ్చిన ‘క్రూక్’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత నేహా శర్మకు చాలా సినిమా ఆఫర్లు రావడం ప్రారంభించాయి.
కానీ 16 ఏళ్ల సినీప్రయాణంలో నేహా ఖాతాలో కేవలం ఒక్క హిట్టు మాత్రమే పడింది. ప్రస్తుతం నేహా శర్మ ఆస్తులు రూ.22 కోట్లు అని సమాచారం. నేహా తండ్రి అజిత్ శర్మ, బీహార్ శాసనసభలో భాగల్పూర్ నియోజకవర్గం నుండి అనేకసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే. నటి నేహా శర్మ 2020 నుండి చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంది. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..




