AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఇస్మార్ట్ శంకర్’ కథ నాదే… రైటర్ ఫిర్యాదు!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెల 18న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే ఊపందుకున్నాయి. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో రామ్ పూర్తి మాస్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాపై వివాదం ముసురుకోవడం […]

'ఇస్మార్ట్ శంకర్' కథ నాదే... రైటర్ ఫిర్యాదు!
Ravi Kiran
|

Updated on: Jul 15, 2019 | 5:11 PM

Share

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెల 18న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే ఊపందుకున్నాయి. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో రామ్ పూర్తి మాస్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాపై వివాదం ముసురుకోవడం ఇప్పుడు సంచలనమైంది. ట్రైలర్ చూసినందరూ ఈ సినిమా కూడా కాపీనే అని విమర్శిస్తున్నారు.

2016లో విడుదలైన హాలీవుడ్ చిత్రం ‘క్రిమినల్’కు.. ఈ సినిమా కథకు పోలికలు ఉన్నాయని పలువురు క్రిటిక్స్ విమర్శలు గుప్పించారు. `క్రిమినల్` కథాంశం ప్రకారం.. ఓ హ్యాకర్ ని సీఐఏ ఏజెంట్ వెంటాడుతాడు. కానీ ఆ ఏజెంట్ హత్యకు గురవుతాడు. ఆ క్రమంలోనే అతడి బ్రెయిన్ లోని మెమరీస్‌ని చిప్ ద్వారా కాజేసి సదరు క్రిమినల్ బ్రెయిన్‌లోకి పంపిస్తారు. సరిగ్గా ఇలాంటి కథ తరహాలోనే ‘ఇస్మార్ట్ శంకర్’ కథ కూడా ఉందని ట్రైలర్ చూసిన క్రిటిక్స్ ఆరోపణ. ఈ స్టోరీని పూరి హాలీవుడ్ నుంచి ఫ్రీమేక్ చేశారని చర్చ జరుగుతోంది.

మరోవైపు ఈ కథ నాదేనంటూ ఓ యువ రైటర్ రచయితల సంఘంలో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ‘ఇస్మార్ట్ శంకర్’ కథను నిర్మాత స్రవంతి రవికిషోర్‌కు గతంలో చెప్పానని.. ఆ కథనే పూరి యధాతధంగా తెరకెక్కించాడని సదరు రచయిత తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరి ఈ తతంగంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Follow Us
మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏమని స్పందించిందంటే..
మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏమని స్పందించిందంటే..
ఆదివారం ఈ సంకేతాలు కనిపిస్తే అదృష్టం పరిగెత్తుక వస్తున్నట్లే!
ఆదివారం ఈ సంకేతాలు కనిపిస్తే అదృష్టం పరిగెత్తుక వస్తున్నట్లే!
చిన్న పొరపాటు.. మీ PF క్లెయిమ్స్‌కు ఇబ్బందిగా మారొచ్చు!
చిన్న పొరపాటు.. మీ PF క్లెయిమ్స్‌కు ఇబ్బందిగా మారొచ్చు!
డెబిట్‌ కార్డ్‌ నుంచి EMIలు చెల్లిస్తున్నారా? ఇది తెలుసుకోండి!
డెబిట్‌ కార్డ్‌ నుంచి EMIలు చెల్లిస్తున్నారా? ఇది తెలుసుకోండి!
ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి అసలు కారణం అదే
ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి అసలు కారణం అదే
హీరోయిన్ రాశీఖన్నా కారవాన్‌లో దొంగతనం..ఏం చోరీ చేశారో తెలుసా?
హీరోయిన్ రాశీఖన్నా కారవాన్‌లో దొంగతనం..ఏం చోరీ చేశారో తెలుసా?
అక్షయ తృతీయ రోజు బంగారం కొనడానికి శుభ ఘడియలు..ఆ 92 నిమిషాలే కీలకం
అక్షయ తృతీయ రోజు బంగారం కొనడానికి శుభ ఘడియలు..ఆ 92 నిమిషాలే కీలకం
రేపటితో ముగుస్తున్న Polycet 2026 ఆన్‌లైన్ దరఖాస్తులు.. లింక్ ఇదే
రేపటితో ముగుస్తున్న Polycet 2026 ఆన్‌లైన్ దరఖాస్తులు.. లింక్ ఇదే
సమ్మర్‌లో రోజూ కొబ్బరి నీళ్లు తాగితే.. మీ శరీరంలో కనిపించే మార్పు
సమ్మర్‌లో రోజూ కొబ్బరి నీళ్లు తాగితే.. మీ శరీరంలో కనిపించే మార్పు
AC నుంచి వాటర్‌ లీక్‌ అవుతుందా? ఇలా చేయండి!
AC నుంచి వాటర్‌ లీక్‌ అవుతుందా? ఇలా చేయండి!