AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పసిపిల్లల నుంచి పెద్దోళ్ల వరకు చలువ చేసే అతి ప్రాచీన హల్వా.. తయారీ ఇలా!

పూర్వకాలం నుంచి మన పెద్దలు ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలున్న సహజ పదార్థాలను ఆహారంగా తీసుకునేవారు. అలాంటి వాటిలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన 'పాలగుండ' ఒకటి. పాలగుండలో ఉండే ఔషధ గుణాలు శరీరంలోని అధిక వేడిని హరించి, తక్షణ చలువను అందిస్తాయి.

Phani CH
|

Updated on: Aug 28, 2026 | 3:39 PM

Share
ఈ హల్వా సులభంగా జీర్ణం కావడమే కాకుండా పొట్ట సమస్యలు, అసిడిటీ, విరేచనాలను అరికట్టడంలో ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది. 6 నెలల పసిపిల్లల నుండి 60 ఏళ్ల వృద్ధుల వరకు ఎంతో ఇష్టంగా తినేలా, స్వచ్ఛమైన నెయ్యి, బెల్లం, డ్రైఫ్రూట్స్‌తో నోరూరించే పాలగుండ హల్వాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1 / 5
కావలసిన పదార్థాలు: ఒక కప్పు పాలగుండ పొడి / ఆరోరూట్ పౌడర్,  ఒకటిన్నర కప్పు తురిమిన బెల్లం, రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల స్వచ్ఛమైన నెయ్యి, అర టీస్పూన్ యాలకుల పొడి, జీడిపప్పు, రెండు నుండి మూడు కప్పులు కిస్‌మిస్ మరియు నీళ్లు.

2 / 5
తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు పాలగుండ పొడిని తీసుకోవాలి. అందులో రెండు కప్పుల నీళ్లు పోసి ఉండలు లేకుండా గరిటతో మృదువుగా కలుపుకోవాలి. పాలగుండ నీటిలో చాలా తేలికగా కరిగిపోతుంది. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఒకటిన్నర కప్పుల బెల్లం తురుము, ఒక కప్పు నీళ్లు పోసి కరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత చెత్తాచెదారం లేకుండా వేరొక పాత్రలోకి వడకట్టుకోవాలి. దీనికి ఎటువంటి తీగ పాకం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది.

3 / 5
స్టవ్ మీద కడాయి పెట్టి రెండు చెంచాల నెయ్యి వేసి వేడిచేయాలి. అందులో జీడిపప్పు, కిస్‌మిస్‌లను వేసి దోరగా వేయించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కరిగించిన బెల్లం నీళ్లను పోయాలి. బెల్లం నీరు మరుగుతున్నప్పుడు, ముందుగా కలిపి పెట్టుకున్న పాలగుండ మిశ్రమాన్ని పోస్తూ గరిటతో ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. మంటను మీడియం-లో ఫ్లేమ్‌లో ఉంచాలి. పాలగుండ చాలా వేగంగా ఉడికి నిగనిగలాడే జెల్లీ లాంటి ఆకృతికి చేరుకుంటుంది.

4 / 5
మిశ్రమం దగ్గరపడి గాజులా మెరుస్తున్నప్పుడు యాలకుల పొడి, వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్‌మిస్‌లు మరియు మిగిలిన నెయ్యిని వేసి కలపాలి. హల్వా కడాయికి అంటుకోకుండా నెయ్యిని వదులుతూ దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆపేయాలి. అంతే, ఎంతో కమ్మనైన, నోట్లో వేస్తే కరిగిపోయే పాలగుండ హల్వా సిద్ధం! పిల్లలకు బలాన్ని, పెద్దవారికి శక్తిని మరియు పొట్టకు ఎంతో చలువను అందించే ఈ హెల్తీ స్వీట్‌ను మీరు కూడా తప్పకుండా చేసి చూడండి.

5 / 5
Follow Us